కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
ABN , First Publish Date - 2021-01-20T05:47:00+05:30 IST
కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు హెల్త్‌వర్కర్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది.

54 సెషన్ సైట్లలో 1,806 మంది హెల్త్ వర్కర్లకు టీకా మందు
ఏలూరు ఎడ్యుకేషన్, జనవరి 19 :కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు హెల్త్‌వర్కర్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. టీకా మందును స్థానికంగానే పంపి ణీ చేయడం వల్ల వ్యాక్సినేషన్ విజయవంతం అవుతుం దన్న అంచనాలు నిజమవుతున్నాయి. ఆ మేరకు తొలి మూడు రోజులపాటు జిల్లాలో 23 సెషన్ సైట్లలో మాత్రమే టీకా మందు పంపిణీ జరగగా, మంగళవారం నుంచి వాటి సంఖ్యను 54కి పెంచారు. ప్రతి మండలా నికి ఒక సెషన్ సైట్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా నాలుగో రోజు టీకా మందును నిర్ధేశిత 54 సెషన్ సైట్లోలో మొత్తం 5,602 మంది హెల్త్‌వర్కర ్లకు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 1806 మంది హాజరై వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆచంట, ఎ.వేమవరం, గోపాలపురం, నర్సాపురం, సమశ్రిగూడెం, పెంటపాడు సెషన్ సైట్లలో ఒక్కరు కూడా టీకా మందు వేయించు కోలేదు. వ్యాక్సిన్ తీసుకున్న వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని డీఎంహెచ్‌వో డాక్టర్ సునంద తెలిపారు.