రిలాక్స్‌..అయ్యారు

ABN , First Publish Date - 2021-05-19T05:25:58+05:30 IST

కొద్ది రోజులగా గుక్క తిప్పుకోకుండా విధులను నిర్వర్తిస్తున్న ఏలూరు ఆసుపత్రి సిబ్బంది మంగళవారం రాత్రి కొంత ఊపిరి తీసుకున్నారు. సాయంత్రం

రిలాక్స్‌..అయ్యారు
అత్యవసర విభాగంలో మంగళవారం రాత్రి కరోనా బాధితుల కోసం ఎదురు చూస్తున్న ఆసుపత్రి సిబ్బంది

బాధితులు రాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది

ఏలూరు క్రైం, మే 18 : కొద్ది రోజులగా గుక్క తిప్పుకోకుండా విధులను నిర్వర్తిస్తున్న ఏలూరు ఆసుపత్రి సిబ్బంది మంగళవారం రాత్రి కొంత ఊపిరి తీసుకున్నారు. సాయంత్రం విరామం రావడంతో రిలాక్స్‌ అయ్యారు. మం గళవారం మధ్యాహ్నం 3 గంటల కల్లా ఆసుపత్రిలో 44 మంది డిశ్చార్జి అయ్యారు. మరో ముగ్గురు మరణించారు. ఆసుపత్రిలో మాత్రం 76 మంది చేరారు. మొత్తం మంగళవారం రాత్రికి 333 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.అత్యవసర విభాగంలో ఆక్సిజన్‌ పడకలు వైద్య చికిత్స అందించడానికి ఉండగా కొద్ది రోజుల నుంచి ఈ పడకలు ఖాళీ లేనేలేవు. మంగళ వారం రాత్రి మాత్రం అత్యవసర విభాగంలో ఈ  మూడు పడకలు ఖాళీతో పాటు అత్యవసర విభాగానికి కరోనా బాధితులు ఎవరూ రాక పోవడంతో అక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇలాగే ఉండాలంటూ వారు భగవంతుడిని వారు ప్రార్థించుకున్నారు. అత్యవసర విభాగం వద్ద వాహనాల్లోనూ, అంబులెన్సుల్లోనూ వచ్చిన బాధితులకు అక్కడ ఉన్న వైద్యులు, సిబ్బంది వెంటనే పల్స్‌ ఆక్సీమీటర్ల ద్వారా శాచురేషన్‌ పరిశీలిస్తు న్నారు. 90 కంటే దిగువ ఉన్న వారికి ఆసుపత్రిలో అడ్మిషన్‌ కల్పిస్తున్నారు. 90 కంటే ఎగువ ఉన్న వారిని అక్కడే ఉంచి శాచురేషన్‌ను పరిశీలిస్తున్నారు.ఆక్సిజన్‌ పెట్టిన తరువాత శాచ్యురేషన్‌ పెరిగితే హోమ్‌ ఐసోలేషన్‌కు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. అవసరమైనవారికి సీటీ స్కాన్‌ చేయించడానికి ఆసుపత్రిలో ఉన్న ఉచిత సిటీస్కాన్‌ సెంటర్‌కు పంపి స్తున్నారు. మొత్తం మీద మంగళవారం రాత్రి కరోనా బాధితుల తాకిడి తగ్గడంతో కొంత సమయం వారు రిలాక్స్‌ అయ్యారు. 


Updated Date - 2021-05-19T05:25:58+05:30 IST