షటిల్ ఆడుతూ.. సీఐ హఠాన్మరణం
ABN , First Publish Date - 2021-03-24T06:01:21+05:30 IST
గణపవరం సీఐ డేగల భగవాన్‌ప్రసాద్ (48) మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో షటిల్ ఆడుతూ కుప్ప కూలిపోయారు.

గుండెపోటుతో కుప్పకూలిన భగవాన్‌ప్రసాద్
కానిస్టేబుల్ నుంచి సీఐగా..
గణపవరం, మార్చి23: గణపవరం సీఐ డేగల భగవాన్‌ప్రసాద్ (48) మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో షటిల్ ఆడుతూ కుప్ప కూలిపోయారు. సర్వీస్ చేసిన వెంటనే ఆయాసం రావడంతో.. ఊపిరి తీసుకునేలోపే.. నేలపై పడిపోయారు. అప్పటి వరకు ఆడుతు న్న వారు ఏం జరిగిందో తెలుసుకునేలోగా.. అప్పటికే ఆయన ఊపిరి ఆగిపోయింది. వెంటనే ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసు కుని వెళ్లగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందిన ట్టు నిర్ధారించారు. తూర్పు గోదావరి జిల్లా కరప వద్ద సజ్జాపురపుపాడుకు చెందిన భగవాన్ ప్రసాద్ 2003లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలని తపించేవారు. ఈ క్రమంలో 2007లో రిజర్వుడు ఎస్‌ఐగా ఎంపికై జిల్లాలోని గణపవరం, తాడే పల్లిగూడెం, నిడదవోలు తదితర ప్రాం తాల్లో పనిచేశారు. 2018లో సీఐగా పదో న్నతి పొంది కుక్కునూరులో పనిచేశారు. 2019 నుంచి రెండే ళ్లగా గణపవరంలో సీఐగా ఉన్నారు. ఆయన ఎక్కడ పనిచేసినా తనదైన మార్క్ చూపించే వారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల కష్టాలను ఎంతో ఓపిగ్గా విని.. వారి సమస్యల ను పరిష్క రించేవారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరయ్యారు. జిల్లా ఎస్పీ నారాయణ నాయక్, ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, డీఎస్పీ దిలీప్‌కిరణ్, ఎస్‌ఐలు ఎం.వీర బాబు, నాగరాజు, వీర్రాజు, పోలీస్ అధికారుల సంఘం సెక్రటరీ రాయుడు విజయ్‌కుమార్, కానిస్టేబు ళ్లు గణప వరం ఆసుపత్రికి చేరుకున్నారు. భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంచి వ్యక్తిగా పేరుండడంతో ఆసుపత్రి వద్దకు పెద్దఎత్తున జనం చేరుకున్నారు. భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు చేశారు.
