AP: జల్లేరు వాగు బస్సు ప్రమాదానికి అంతుబట్టని కారణాలు
ABN , First Publish Date - 2021-12-16T16:52:08+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగు బస్సు ప్రమాదానికి కారణాలు అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగు బస్సు ప్రమాదానికి కారణాలు అంతుచిక్కని పరిస్థితి ఏర్పడింది. డ్రైవర్‌కు గుండెపోటు రావడం వలనే ప్రమాదం అంటూ ప్రచారం జరుగుతోంది. డ్రైవర్‌కు ఊపిరాడక చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదకిలో వెల్లడైంది. కాగా... బైక్‌ను తప్పించబోయే క్రమంలో ప్రమాదం జరిగిదంటూ కధనాలు వస్తున్నాయి. బైక్‌ను తప్పించినా బస్సు నేరుగా వెళుతున్నట్లు సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు డ్రైవర్ అతి వేగం కారణం అయి ఉండవచ్చని ఆర్టీసీ ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బస్సు కండీషన్లో లేకపోవడం వలనే ప్రమాదం జరిగిందని ఆర్టీసీ ఉద్యోగుల ఆరోపిస్తున్నారు.