సీతమ్మ దయచూపేనా?
ABN , First Publish Date - 2021-02-01T05:44:17+05:30 IST
పోలవరం ప్రాజెక్టుకు పుష్కలంగా నిధులిస్తారా..? వేతన జీవులు ఆశిస్తున్నట్టు ఆదాయ పరిమితి పెంచే అవకాశాలు ఉన్నాయా..?

కేంద్ర బడ్జెట్‌పై ఆశలు.. ఆకాంక్షలు
పోలవరం ప్రాజెక్టు కష్టాలు తీర్చేనా ?
ఆక్వాపై వరాలు కురిపిస్తారా.. గాలికొదిలేస్తారా?
పంట గిట్టుబాటు ప్రోత్సాహాలు ఉంటాయా..?
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
పోలవరం ప్రాజెక్టుకు పుష్కలంగా నిధులిస్తారా..? వేతన జీవులు ఆశిస్తున్నట్టు ఆదాయ పరిమితి పెంచే అవకాశాలు ఉన్నాయా..? కరోనా దెబ్బతో అయోమయంలో పడిన ఆక్వాకు ప్రోత్సాహకాలు ఉంటాయా..? మండుతున్న వంట నూనెల ధరలను అదుపు చేసేందుకు పామాయిల్ ధరపై కొత్త నిర్ణయాలు తీసుకుంటారా..? ధాన్యానికి కనీస మద్దతు ధర పరిస్థితేంటి..? అందరినోటా ఇవే ప్రశ్నలు. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.
పోలవరంపై ఈసారి ఏంటి
గత వార్షిక బడ్జెట్‌లో పోలవరానికి అంతంత మా త్రంగానే రూ.2,234 కోట్లు కేటా యించారు. వాస్తవానికి 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.55,656 కోట్లకు చేరింది. నిధుల విడుదల విష యంలో కేంద్ర జలవనరుల శాఖ ఆచితూచి వ్యవ హరిస్తోంది. ఈ వార్షిక బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లకు మించి ఇచ్చేది లేదన్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సంకేతాలు పంపింది. ఇప్పటికే సహాయ, పునరావాస పనులు మం దకొడిగా సాగడం, భూసేకరణపై ఒకింత అసంతృప్తి ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పోలవరం నిర్మా ణ వ్యయ నిర్వహణ ఖర్చు రూ.55 వేల కోట్లుగా నిర్ధే శించి ఆ మేరకే నిధులు విడుదల చేయాలని చెబుతోం ది. గతేడాది జూన్ నాటికే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ముంపు ప్రాంతాలను ఖాళీ చేయించి పున రావాస కేంద్రాలకు నిర్వాసితులను తరలించాల్సి ఉండ గా ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు పుంజుకోలేదు. స్పిల్‌వే గేట్ల నిర్మాణం చురుగ్గానే సాగుతున్నా కాఫర్ డ్యామ్, మార్చి నుంచి ఎర్త్‌కం రాక్ ఫిల్ డ్యామ్ అంటే ప్రధాన డ్యామ్ నిర్మాణం చేపడతా మని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా కేంద్ర నిధులు పూర్తిగా విదిలిస్తేనే పనులు సాగే అవకాశం ఉంది.
ఆక్వాను ఏం చేయబోతున్నారు
గోదావరి జిల్లాల్లో ఆక్వా ఉత్పత్తులు, రైతులకు లభిం చే రాబడి, విదేశీ మారకద్రవ్యం దృష్టిలో పెట్టుకుని కేం ద్రం ప్రత్యేక దృష్టిపెట్టింది. గతేడాది బడ్జెట్‌లోనూ ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా తాము సంసి ద్ధంగా ఉన్నామని, ఎగుమతుల విషయంలోనూ తమ సహకారం ఉంటుందని ప్రకటించింది. కరోనా దెబ్బతో ఆక్వా రంగం కుదేలైంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిదా రులు నష్టాల్లో కూరుకుపోయారు. ఆక్వాకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోల్డ్ స్టోరే జీలకు వీలుగా రాయితీలు ప్రకటిస్తే ఈ రంగం కోలు కుంటుంది. తాజా బడ్జెట్‌లో కేంద్ర మంత్రి సీతమ్మ ఆక్వాకు ఏదైనా వరాలను ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్నారు.
రైతుల ఎదురుచూపులు
గత బడ్జెట్‌లో రైతుకు ప్రాధాన్యంఇచ్చినా కరోనా వెన్నాడింది. పంట ఉత్పత్తి ధరలు పడిపోగా దళారులు భారీగా లాభపడ్డారు. పండించిన రైతు నష్టాల పాల య్యాడు. పంటల బీమా పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేసినా పెద్దగా ప్రయోజనం లేక పోయింది. గోడౌన్ల నిర్మాణం, పంట లకు కనీస మద్దతు ధర వంటి వాటి విషయంలో ప్రోత్సాహ క వరాలు ఇస్తేనే రైతులు కోలుకునేఅవకాశం ఉంది.
వేతన జీవుల్లో.. ఆశలు
ప్రతి బడ్జెట్‌లోనూ వేతన జీవులు ఎంతో ఆశతో ఎదురుచూసేది ఆదా య పన్ను పరిమితి గురించే. ప్రత్యేకించి వార్షిక ఆదాయపు పరిమితి రెండు లక్షల 50 వేల నుంచి ఐదు లక్షలకు చేయాలని కొన్నే ళ్లుగా వేతన జీవులతోపాటు మధ్య తరగతి వర్గాలు డిమాండ్ చేస్తున్నా యి. కేంద్రం మాత్రం వార్షిక ఆదాయ పరిమితి పెంపు విషయంలో ఇప్పటి వరకు ఎప్పుడూ ప్రోత్సాహక నిర్ణయాలు తీసుకోలేదు.
బంగారం మాటేంటి ?
పది గ్రాముల బం గారం ధర రూ.50 వేలకు.. వెండి కిలో ధర అత్యధికంగా 70 వేల గరిష్ట స్థాయికి చేరింది. బులియన్ మార్కెట్‌లో ఈ తరహా దూకుడు వ్యాపారులకు లాభదాయకమైనప్పటికీ వినియోగదా రులు బెంబేలెత్తిపోయే పరిస్థితి. కొత్త బడ్జెట్ మార్కెట్‌పై ఏ రకమైన ప్రభావం చూపిస్తుందో తేలనుంది.
రైలు ఆపేనా?
జిల్లా వాసుల ఎదురుచూపులు
నరసాపురం, జనవరి 31 : కేంద్ర ఆర్థిక మం త్రి నిర్మలా సీతారా మన్ సోమవారం పార్ల మెంట్‌లో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌పై జిల్లావాసులు ఉత్కం ఠగా ఎదురు చూస్తున్నారు. ఆమె మన జిల్లా కోడలు కావడంతో ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. కొత్త రైళ్లతోపాటు రైల్వేలైన్లకు నిధులు పెంచుతారని ఆశిస్తున్నారు. 2013లో చేపట్టిన విజయవాడ–నరసాపురం విద్యుత్ లైన్ డబ్లింగ్ పనుల్లో ప్రస్తుతం 129 కిలోమీటర్లు పూర్తయింది. భీమవరం – నరసాపురం, భీమవరం – నిడదవోలు మధ్య పనులు మార్చి నాటికి పూర్తి చేయాలని భావించారు. నిధుల కొరతతో సగం పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. గత బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.200 కోట్లు కేటాయించారు. ఈ సారి పూర్తిస్థాయిలో కేటాయిస్తే డిసెంబర్‌కు ప్రాజెక్టు పూర్తికానుంది.
2014లో ప్రతిపాదించిన 57 కిలోమీటర్ల నరసాపురం– కోటిపల్లి కొత్తలైన్ 2020 నాటికి పూర్తి కావాల్సి ఉంది. రూ.2,126 కోట్ల అంచనాతో నిర్ణీత సమయంలో పనులు చేపట్టకపోవడం వల్ల బడ్జెట్ పెరిగింది. ఇప్పటి వరకు రూ.1,200 కోట్లు కేటాయించారు. గోదావరిపై చించి నాడ, పాశర్లపూడి, కోటిపల్లి, ముక్తేశ్వరం మధ్య మూడు వంతెన పనులు జరుగుతున్నాయి. వీటికే రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. భూసేకరణ పెండింగ్ పడింది. గత బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు కేటాయించారు. ఈసారి నిధులు పెంచుతారన్న ఆశ ఉభయ గోదావరి జిల్లావాసుల్లో నెలకొంది.
కొవ్వూరు–భద్రాచలం కొత్త రైల్వే లైన్‌కు గత బడ్జెట్లలో సర్వే పనులకు మాత్రమే నామమాత్రంగా నిధులు కేటాయించారు. 53 కిలోమీటర్ల మేర ఈ కొత్త రైల్వేలైన్ పూర్తయితే జిల్లాలోని మెట్ట ప్రాంతానికి రైల్వే మార్గం ఏర్పడుతుంది. విశాఖ నుంచి మెయిన్‌లైన్‌లో వచ్చే రైళ్ల ను విజయవాడ వెళ్లకుండా వరంగల్ మీదుగా మళ్లించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో దీనికి నిధులు కేటాయిం పులు జరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నరసాపురం స్టేషన్‌లో ఫిట్‌లైన్ పనులు పూర్తి కావడం తో బడ్జెట్‌లో కొత్త రైళ్లకు పచ్చజెండా ఊపుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రతిపాదించిన నరసాపురం–వారణాశి, నరసాపురం–బెంగళూరు రైళ్లకు మోక్షం లభిస్తుందన్న ఆశ డెల్టావాసుల్లో నెలకొంది.