76 ఆక్సిజన్ మిషన్లను కొనుగోలు చేసిన ఎమ్మెల్యే గ్రంధి
ABN , First Publish Date - 2021-05-20T18:24:21+05:30 IST
కోవిడ్ పేషెంట్లుకు ఆక్సిజన్ అందించే 76 ఆక్సిజన్ కాన్‌సన్ ట్రేటర్స్ మిషన్లను భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కొనుగోలు చేశారు.

ఏలూరు: కోవిడ్ పేషెంట్లుకు ఆక్సిజన్ అందించే 76 ఆక్సిజన్ కాన్‌సన్ ట్రేటర్స్ మిషన్లను భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కొనుగోలు చేశారు. 46 లక్షల 50 వేలు విలువైన కాన్‌సన్ ట్రేటర్స్ మిషన్లను సబ్ కలెక్టర్ విశ్వనాథన్‌కు ఎమ్మెల్యే అందజేశారు. గ్రంధి శ్రీనివాస్ సొంత నిధులతో 20 , దాతల సహాకారంతో 56 ఆక్సిజన్ కాన్ సన్ ట్రేటర్స్ మిషన్లను కొనుగోలు చేశారు.