అరటి గెల వెల..వెల..
ABN , First Publish Date - 2021-01-20T05:53:53+05:30 IST
జిల్లాలో సుమారు 14,600 హెక్టార్లలో అరటి సాగు చేస్తున్నారు. ఇందులో అధిక శాతం కర్పూర రకం పండిస్తుం డగా, అమృతపాణి, చక్కరకేళీ, కూర అరటి రకా లు తక్కువ హెక్టార్లలో సాగు చేస్తున్నారు.

అధిక వర్షాలకు తగ్గిన దిగుబడి
నష్టాలతో కుదేలవుతున్న రైతు
శుభకార్యాలకు డిమాండ్ లేదు
ఓ వైపు దిగుబడి లేక.. మరో వైపు గిట్టుబాటు ధర లభించక అరటి రైతులు నష్టాల పాలవుతున్నారు. ఈ ఏడాది తుఫాన్లు, వర్షాలకు అరటి చెట్లు చాలా వరకు నేల కూలాయి. ఫలితంగా దిగుబడి తగ్గింది. గడిచిన కార్తీక, ఽధను ర్మాసంలో హిందువులు, క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భం గా క్రైస్తవులు కర్పూర రకం అరటిని అధికంగా వినియోగిం చినప్పటికీ మరో నాలుగు నెలలపాటు ముహూర్తాలు, పండుగలు లేకపోవడంతో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. రైతు వద్ద ధర లేకున్నా.. రిటైల్ మార్కెట్‌లో మాత్రం అదరగొడుతున్నాయి.
పాలకొల్లు, జనవరి 19 : జిల్లాలో సుమారు 14,600 హెక్టార్లలో అరటి సాగు చేస్తున్నారు. ఇందులో అధిక శాతం కర్పూర రకం పండిస్తుం డగా, అమృతపాణి, చక్కరకేళీ, కూర అరటి రకా లు తక్కువ హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇటీవల అధిక వర్షాల కారణంగా అరటి తోటల్లో నీరు నిల్వ ఉండి భూమి ఇవక వేయడంతో అరటి గెలలు నాశి గా ఎదిగాయి. గెల 30 కిలోల దిగుబడి రావాల్సి ఉం డగా సగానికి పడిపోయింది. ఇవక నేలల్లో అరటి గెల లు నాశిరకంగా ఉండి అరటి కాయలు గిడస(కురస) బారడంతో నాణ్యత తగ్గిందం టూ వర్తకులు ధర తగ్గించేశారు. జిల్లాలోని గోదావరి పరివాహక గ్రామాల్లో అరటి ని అధికంగా సాగుచేస్తున్నారు. మెట్టలోని ఎనిమిది మండలాల్లో అరటిసాగు విస్తీ ర్ణం మెరుగ్గా ఉంది. డెల్టాలో ఇటీవల అరటి సాగు క్రమేపీ తగ్గించేశారు. ఎకరానికి రూ.50 వేలు నష్టం వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమీపరో జుల్లో ముహూర్తాలు లేకపోవడం, ఉగాది వరకూ పండుగలు లేకపోవడంతో ధర లు మరింత పతనమవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్న చందాన అమ్మకాలు తయారయ్యాయి.
గిట్టుబాటు కావడం లేదు
‘అరటి పంట రైతులకు కనీసం గిట్టుబాటు కావడం లేదు. ఎంతో కాలంగా సాగు చేయడం వల్ల మానలేక నష్టమైనా ఎకరం భూమిలో అరటి సాగు చేస్తున్నాన’ని అబ్బిరాజు పాలెంకు చెందిన రైతు సిర్రా సంపత్‌రావు చెప్పారు. ‘అరటి గెలలకు సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నాం. కూర అరటి, కర్పూర, చక్కరకేళీ మార్కెట్లో భారీ ధర ఉన్నప్పటికీ మంచి ధర లభించడం లేద’ని వడ్లవానిపాలెంకు చెందిన రైతు కడలి సాయిబాబు వాపోయారు.