ఘనంగా బల్లిపాడు మదనగోపాలుడి కల్యాణం

ABN , First Publish Date - 2021-03-24T05:37:20+05:30 IST

బల్లిపాడు మదన గోపాలస్వామి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.

ఘనంగా బల్లిపాడు మదనగోపాలుడి కల్యాణం
ప్రత్యేక అలంకరణలో ఉన్న మదనగోపాలుడు

అత్తిలి, మార్చి 23 : బల్లిపాడు మదన గోపాలస్వామి కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామి వారిని పెండ్లి కుమారుడు, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా అలంకరించారు.రాత్రి 10.30 గంటలకు కల్యాణాన్ని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభిం చారు. విశేష అలంకరణలో ఉన్న స్వామి అమ్మ వార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగ ంగా గీతావధాని యర్రంశెట్టి ఉమా మహేశ్వరరావు భగవద్గీతపై ప్రవచనం చేశారు. నేటి సమాజంలో భగవద్గీతను వేదాంత గ్రంథంగా  భావించి ప్రతీ ఒక్కరూ ఆచరించాలని సూచించారు. 

Updated Date - 2021-03-24T05:37:20+05:30 IST