90 శాతం వెదజల్లే విధానంలో వరి సాగు
ABN , First Publish Date - 2021-02-07T05:13:54+05:30 IST
జిల్లాలో 90 శాతం పైగా నేరుగా వెదజల్లే వరి విధానం కొనసాగుతోందని తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ సంయుక్త సంచా లకుడు జె.ప్రసాద్ అన్నారు.

వ్యవసాయ సంయుక్త సంచాలకుడు ప్రసాద్
పెనుమంట్ర, ఫిబ్రవరి 6 : జిల్లాలో 90 శాతం పైగా నేరుగా వెదజల్లే వరి విధానం కొనసాగుతోందని తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ సంయుక్త సంచా లకుడు జె.ప్రసాద్ అన్నారు. మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శనివారం ఉభయగోదావరి జిల్లాల్లోని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో ఆన్‌లైన్ ద్వారా సమీక్షించారు. ఈ ఏడాది ఎంటీయూ 1121 రకం 75 శాతం కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారన్నారు. జేడీ గౌసియాబేగం మాట్లా డుతూ జిల్లాలో 95 శాతం పైగా ఎంటీయూ 1121 వరి రకం సాగువుతుందని తెలిపారు. జిల్లాలో ఎక్కువ ప్రాంతంలో జింక్ లోపం కనిపిస్తోందని తెలిపారు. వ్యవసాయాధికారులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త సి.వెంకటరెడ్డి, డాక్టర్ పి.రమేష్‌బాబు, భువనేశ్వరి, మానుకొండ శ్రీనివాస్, ఎం.నంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.