రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-03-22T05:16:27+05:30 IST

క్రీడా కారులు గెలుపోటములను సమా నంగా స్వీకరిస్తూ పట్టుదల ప్రణాళి కతో ముందుకు సాగాలని దెందు లూరు ఎస్‌ఐ డి.రాంకుమార్‌, జిల్లా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ చైర్మ న్‌ ప్రసాద్‌ అన్నారు.

రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలు ప్రారంభం

దెందులూరు, మార్చి 21: క్రీడా కారులు గెలుపోటములను సమా నంగా స్వీకరిస్తూ పట్టుదల ప్రణాళి కతో ముందుకు సాగాలని దెందు లూరు ఎస్‌ఐ డి.రాంకుమార్‌, జిల్లా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ చైర్మ న్‌ ప్రసాద్‌ అన్నారు. ముప్పవరం పంచాయతీ శింగవరం పరిధిలో ఆదివారం 39వ సబ్‌ జూనియర్‌ అండర్‌–17 షూటింగ్‌ బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలను రాష్ట్ర కార్యదర్శి జోసెఫ్‌, జిల్లా కార్యదర్శి సుధీర్‌కుమార్‌లతో కలిసి ఎస్‌ఐ ప్రారంభించారు. రెండు రోజుల పా టు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి 300 మంది క్రీడా కారులు విచ్చేశారు. బాలురు విభాగంలో.. వైజాగ్‌– నెల్లూరు జట్లు పోటీ పడగా నె ల్లూరు విజయం సాధించింది. పశ్చిమగోదావరిపై విజయనగరం, అనంతపురంపై ప్రకాశం, తూర్పుగోదావరిపై గుంటూరు, కృష్ణాపై నెల్లూరు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో.. కర్నూలుపై నెల్లూరు, ప్రకాశంపై విజయనగరం, తూర్పు గోదావరిపై పశ్చిమగోదావరి, కర్నూలుపై కృష్ణా, కడపపై అనంతపురం, కృష్ణాపై నె ల్లూరు, విజయనగరంపై వైజాగ్‌, పశ్చిమగోదావరిపై గుంటూరు గెలుపొందింది. 

Updated Date - 2021-03-22T05:16:27+05:30 IST