మహాప్రస్థానం వాహన డ్రైవర్ల సంఘం ఏర్పాటు

ABN , First Publish Date - 2021-02-06T05:48:17+05:30 IST

ప్రభుత్వాస్పత్రుల్లో మృతదేహాలను గమ్య స్థానా లకు ఉచితంగా చేర్చడానికి మహాప్రస్థానం వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

మహాప్రస్థానం వాహన డ్రైవర్ల సంఘం ఏర్పాటు
సమావేశంలో పాల్గొన్న ఏఐటీయూసీ నాయకులు, వాహన డ్రైవర్లు

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 5: ప్రభుత్వాస్పత్రుల్లో మృతదేహాలను గమ్య స్థానా లకు ఉచితంగా చేర్చడానికి మహాప్రస్థానం వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిలో పనిచేస్తున్న డ్రైవర్లు ఒక సంఘంగా ఏర్పడ్డారు. రాష్ట్రస్థాయి సమావేశం ఏలూరులో శుక్రవారం నిర్వహించారు. ఈ సంఘాన్ని ఏఐటీయూ సీలో అనుబంధం చేశారు. ఏపీ మెడికల్‌ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కెకృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా, సమావేశానికి ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ బ్రాంచ్‌ కార్యదర్శి డి.లక్ష్మణ మూర్తి పాలొ ్గన్నారు. కార్యక్రమాన్ని యశోద కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడు తూ మహా ప్రస్థానంలో పనిచేసే డ్రైవర్లకు ఉద్యోగ భద్రత లేదని, నిర్ణీత పని గంటలు లేవని, 24 గంటలు విధుల్లోనే నిద్రహారాలు లేకుండా పని చేయాల్సి వస్తోందన్నారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో యూనియన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్‌ హుమాయున్‌ అలి యాస్‌ రఫీ (గుంటూరు), ఉపాధ్యక్షులుగా ఎ.శ్రీకాంత్‌ (శ్రీకాకుళం) రాష్ట్ర ప్రధా న కార్యదర్శిగా యశోద కృష్ణారెడ్డి (ఏలూరు), జాయింట్‌ సెక్రటరీగా బి.రాము (కాకినాడ), ట్రెజరర్‌గా వి.మురళీకృష్ణ (తిరుపతి)లను ఎంపిక చేశారు.  

Updated Date - 2021-02-06T05:48:17+05:30 IST