ఇంటింటికీ రేషన్ కష్టాలు..!
ABN , First Publish Date - 2021-02-02T05:18:32+05:30 IST
ఇంటింటికీ రేషన్ ప్రారంభం లోనే ప్రజలు పలు ఇక్కట్లకు గురయ్యా రు.

ఛార్జింగ్‌లేక మొరాయించిన తూనిక మిషన్లు
సర్వర్ మొరాయింపు.. తొలిరోజే తప్పని పాట్లు
ఏలూరు ఫైర్‌స్టేషన్/ఏలూరు రూరల్, ఫిబ్రవరి 1: ఇంటింటికీ రేషన్ ప్రారంభం లోనే ప్రజలు పలు ఇక్కట్లకు గురయ్యా రు. సోమవారం నుంచి ప్రభుత్వం మో టారు వాహనంతో ఇంటింటికీ వెళ్లి రేషన్ సరుకులు సరఫరా చేయడానికి శ్రీకారం చుట్టింది. అయితే వాహనాలు ఇంటింటికీ వెళ్లకుండా వీధిలో ఒకచోట పెట్టి వారందరినీ వాహనం దగ్గరకు రప్పించి రేషన్ పంపిణీ చేశారు. దీంతో లబ్ధి దారులు అసహనం వ్యక్తం చేశారు. 35వ డివిజన్‌లో రేషన్ పంపిణీ చేస్తుం డగా ఛార్జింగ్ లేక తూకం మిషన్ ఆగిపోయింది. చాలాసేపు ప్రజలు ఎండలో వేచి ఉండాల్సి వచ్చింది. ఛార్జింగ్ అయ్యేసరికి సర్వర్ మొరాయించింది. దీంతో ప్రజలు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇదే వార్డులో 430 కార్డులు ఉంటే కేవలం 200 మందికి మాత్రమే రేషన్ ఎలాట్ చేశారు. కార్డులు ఉన్నప్పటికీ చాలా మందికి రేషన్ లేకపోవడంతో నిరాశకు గురయ్యారు. నగరంలో 106 షాపులకు 36 వెహికల్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క వెహికల్‌దారుడు రోజుకు కనీసం 100 ఇళ్లకు వెళ్లి రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈనెల 18వ తేదీ వర కు రేషన్‌ను సరఫరా చేయాల్సి ఉంది.
గ్రామాల్లో మళ్లీ వాయిదా..
గ్రామాల్లోని రేషన్ కార్డుదారులకు ఇంటిం టికీ సరుకులు పంపిణీ మళ్లీ వాయిదా పడింది. రేషన్ సరుకులు పంపిణీ చేసే వాహనాలపై సీఎం జగన్ బొమ్మ, స్టిక్కర్లతో పాటు పార్టీ జెండా రంగులు పోలినవి అంటించి ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులోకి రావ డంతో వాటి సరఫరాను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో సరుకుల పంపిణీ మళ్లీ వాయిదా పడింది. గతంలో ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా పడింది. దీంతో యఽథావిధిగా చౌక దుకాణాల ద్వారా డీలర్లే బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు.