మంచినీటి పథకం కార్మికుల ఆందోళన

ABN , First Publish Date - 2021-08-28T04:55:36+05:30 IST

సత్యసాయి మంచినీటి పథకం కార్మికులు పంప్‌ హౌస్‌ వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.

మంచినీటి పథకం కార్మికుల ఆందోళన
బుట్టాయగూడెంలో కార్మికుల ఆందోళన

నల్లజర్ల, ఆగస్టు 27: సత్యసాయి మంచినీటి పథకం కార్మికులు పంప్‌ హౌస్‌ వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. వారి ఆందోళనకు టీడీపీ  మండల కమిటీ మద్దతు తెలియజేసింది. కార్మికులకు ఏడు నెలలుగా జీతా లు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంబటి వెంకటరత్నం, లక్ష్మణరావు, గన్నమని శ్రీధర్‌, రమేష్‌, గుదే సుబ్బారావు పాల్గొన్నారు.


బుట్టాయగూడెం: వేతన బకాయిలు చెల్లించాలని మంచినీటి పథకం కార్మికుల సమ్మె శుక్రవారానికి 26వ రోజుకు చేరింది. ఎంపీడీవో కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కారించాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం, అధికా రులు స్పందించి వేతనాలు ఇప్పించాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు. అనంతరం కార్యాలయం ఏవో కిరణ్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

Updated Date - 2021-08-28T04:55:36+05:30 IST