కార్మికులకు వేతనాలు చెల్లించాలి

ABN , First Publish Date - 2021-08-26T05:01:31+05:30 IST

వేతన బకాయిలు, ఉద్యోగ భద్రతల కోసం 24 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సత్యసాయి మంచినీటి కార్మికులకు మద్దతుగా రాజానగరం సర్పంచ్‌ కుంజం దుర్గమ్మ బుధవారం రోడ్డుపై బైఠా యించారు.

కార్మికులకు వేతనాలు చెల్లించాలి
బుట్టాయగూడెం సత్యసాయి కార్మికుల నిరసన

బుట్టాయగూడెం, ఆగస్టు 25: వేతన బకాయిలు, ఉద్యోగ భద్రతల కోసం 24 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సత్యసాయి మంచినీటి కార్మికులకు మద్దతుగా రాజానగరం సర్పంచ్‌ కుంజం దుర్గమ్మ బుధవారం రోడ్డుపై బైఠా యించారు. కార్మికులకు తక్షణం వేతన బకాయిలు చెల్లించాలన్నారు. మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపారు. జనసేన నాయకుడు పాదం కృష్ణ, సత్యసాయి యూనియన్‌ నాయకులు పి.వీరబాబు, కె.రామచంద్రుడు, ఎస్‌.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


కామవరపుకోట: సత్యసాయి మంచినీటి పథకం కార్మికులు  బుధవా రం కామవరపుకోటలో ధర్నా ఏడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎస్‌.రవిబాబు, బి.సురేష్‌, ఎన్‌. ఉదయ్‌ భాస్కర్‌, కె.సీతారామయ్య, టి.సుధాకర్‌, ఎ.వి.రత్నం పాల్గొన్నారు.


పోలవరం: సత్యసాయి మంచినీటి పథకం పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని సీపీఎం మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు డిమాండ్‌ చేశారు. ఇటుకలకోటలో గిరిజనుల తాగునీటి సమస్యలు పరిష్కరించాలని, సత్యసాయి మంచినీటి పథకం కార్మికుల జీతాల బకాయి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వేదరాజు చిన్ని, తామా బాలరాజు, బొరగం భూచంద్రం, లక్ష్మీ, నడివి చలపతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-26T05:01:31+05:30 IST