ఆకివీడులో దాహం కేకలు

ABN , First Publish Date - 2021-05-30T05:41:15+05:30 IST

పట్టణ ప్రజలకు గుక్కెడు తాగునీరందక విలవిలలాడుతున్నారు. శుక్రవారం వరకూ రెండు పూటలు కుళాయిల ద్వారా సరఫరా చేసినా ప్రజానీకానికి పూర్తిగా మంచినీరందని పరిస్థితి.

ఆకివీడులో దాహం కేకలు
మంచినీరందక దూర ప్రాంతాల నుంచి మంంచినీటిని తీసుకెళ్తున్న మహిళలు

అడుగంటిన మంచినీటి చెరువులు

తాగునీరందక జనం విలవిల

ఆకివీడు, మే 29: పట్టణ ప్రజలకు గుక్కెడు తాగునీరందక విలవిలలాడుతున్నారు. శుక్రవారం వరకూ రెండు పూటలు కుళాయిల ద్వారా సరఫరా చేసినా ప్రజానీకానికి పూర్తిగా మంచినీరందని పరిస్థితి. పట్టణంలో రోజుకు 20 ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా ఎక్కడో ఒక చోట నీళ్లు అందడంలేదంటూ ఆందోళనలు చేస్తున్నారు. పట్టణంలో ఉన్న మంచినీటి చెరువులు ఒక్కొక్కటిగా అడుగంటడంతో ప్రజలకు సక్రమంగా మంచినీరం దడం లేదు. కాలువలు జూన్‌ 2న వదిలినా చెరువులకు నీటిని నింపుకోవడానికి పది రోజులు పడుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం సాయంత్రం నుంచి చెరువులు నింపుకునే వరకూ ఒక్కపూటనే నీటిని విడుదల చేయాలని నిర్ణయి ంచారు. అయితే పట్టణ ప్రజలకు మాత్రం సమాచారం అందించలేదు. శనివారం ఉదయం కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా కాకపోవడంతో ఎక్కడ మంచినీరు దొరికితే అక్కడ నింపుకుని మహిళలు, జనం పట్టుకెళ్లారు. రెండు పూటలా సరఫరా చేస్తేనే చాలా ప్రాంతాలకు మంచినీరందని పరిస్థితి.. ఒక్క పూట అయితే ఎలా అంటూ పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-05-30T05:41:15+05:30 IST