‘చెత్త’ సమస్య తీరేనా..?

ABN , First Publish Date - 2021-03-23T05:10:37+05:30 IST

నిడదవోలు పురపాలక సంఘ పరిధిలో మొత్తం 28 వార్డులు. మొత్తం జనాభా సుమారు 43 వేల మంది. పట్టణ పరిధిలో సుమారు 13 వేల నివాస గృహాలు ఉన్నాయి.

‘చెత్త’ సమస్య తీరేనా..?
డంపింగ్‌ యార్డులో చెత్త

డంపింగ్‌ యార్డులో ఏళ్ల తరబడి నిల్వ 

నూతన పాలక వర్గం సమస్య పరిష్కరిస్తుందని స్థానికుల  ఎదురుచూపు

 చెత్త సద్వినియోగ పరిస్తే మళ్లీ ఉపయోగడు తుంది.. ‘చెత్తను రెడ్యూస్‌ చేద్దాం..  రీ యూజ్‌ చేద్దాం.. చెత్తపై సమ రం సాగిద్దాం.’. ఇదీ పురపాలక సంఘాల నినాదం. మున్సిపల్‌ కమిషనర్ల కాలర్‌ ట్యూన్‌ కూడా ఇదే. ఇది కాలర్‌ ట్యూన్‌ వరకే పరిమితం అయింది కాని క్షేత్రస్థాయి లో అమలుకు నోచుకోలేదు. చెత్త  యథాతథంగా ఏళ్ల తరబడి డంపింగ్‌ యార్డులో పేరుకుపోయి చుట్టుపక్కల ప్రజలకు దుర్వాసనలతో రోగాల పుట్టగా మారింది. 

నిడదవోలు, మార్చి 22:  నిడదవోలు పురపాలక సంఘ పరిధిలో మొత్తం 28 వార్డులు. మొత్తం జనాభా సుమారు 43 వేల మంది. పట్టణ పరిధిలో సుమారు 13 వేల నివాస గృహాలు ఉన్నాయి. ప్రతినిత్యం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు పారిశుధ్య కార్మికులు ఒక పక్క రోడ్లు శుభ్రపరుస్తూనే మరోపక్క ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేస్తున్నారు. ఇలా ఒక రోజు సేకరించే చెత్త సుమారుగా 22 టన్నుల వరకూ వస్తుందని అంచనా. దీన్ని ఊరు శివారులో ఉన్న కోట సత్తెమ్మ  ఆలయ  సమీపంలోని డంపింగ్‌ యార్డుకు తరలిస్తుంటారు. సుమారు 20 ఏళ్లుగా సేకరిస్తున్న చెత్త ఆ డంపింగ్‌ యార్డులోనే మగ్గుతోంది. అక్కడ నిల్వ ఉన్న చెత్తే సుమారు 25 వేల టన్నుల వరకూ ఉంటుందని అంచనా. చెత్తను రెడ్యూస్‌ చేద్దాం.. రీ యూజ్‌ చేద్దాం అనేది  ఎక్కడా అమలుకాని విషయం. భవిష్యత్తులో అయినా ఈ చెత్త పాలసీ విధానం మారుతుందా అంటే సందేహమే. దీనికి కారణం పారిశుధ్య కార్మికుల కొరత, కంపోస్టు యార్డులో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు మరింత జఠిలం కాకముందే మున్సిపల్‌ పాలకవర్గం, అధికారులు సమస్యపై దృష్టి సారించకపోతే చెత్త మరింత పెద్ద సమస్యగా మారనుంది. ముఖ్యంగా డంపింగ్‌ యార్డుకు సమీపంలోనే జిల్లాలోని ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో ఒకటైన కోట సత్తెమ్మ ఆలయం ఉండడం ఇక్కడకు వచ్చే భక్తులు సైతం ఈ డంపింగ్‌ యార్డు నుంచి వచ్చే దుర్వాసనతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ డంపింగ్‌ యార్డుకు సమీపంలోనే హోలీక్రాస్‌ కమ్యునిటీ  కళాశాల, అధిక సంఖ్యలో నివాసాలు ఉండడంతో చెత్త సమస్యను సత్వరమే  పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

మున్సిపల్‌ చైర్మన్‌ ‘భూపతి’ హామీ

కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ ప్రమాణ స్వీకారం చేసిన రోజే డంపింగ్‌ యార్డులో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి  ఆహ్లాదకరంగా మారుస్తానని  హామీ ఇచ్చారు.

వెంటాడుతున్న కార్మికుల కొరత

పట్టణంలో  114 మంది పారిశుధ్య కార్మి కులు ఉన్నారు. మరో 60 మంది కార్మికులు ఉంటేనే పారిశుధ్య సమస్య తీరుతుంది. ఉన్న సిబ్బందితో పనులు చేయించేందుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌,  మేస్ర్తిలు తలలు పట్టుకొంటున్నారు.

దుర్వాసనతో అవస్థలు పడుతున్నాం

ఎన్నో ఏళ్లుగా సుమారు 50మందికి పైగా ఇదే కాలనీలో ఉంటున్నాం. కొన్నేళ్లుగా డంపిం గ్‌ యార్డులోని చెత్తను  వదిలేయడంతో  దుర్వాసనతో అవస్థలు పడుతున్నాం. పక్కనే ఉన్న కోట సత్తెమ్మ ఆల యానికి వచ్చే భక్తులు కూడా ఇబ్బందిపడుతు న్నారు. అధికారులకు వినతిపత్రం అందజేసిన పట్టించుకోవడం లేదు. 

– ప్రభుదాసు, మోషే లెప్రసీ కాలనీ 


సమస్య త్వరలో పరిష్కరిస్తాం

ప్రభుత్వం తడి, పొడి చెత్త సేకరణకు ప్రతి వార్డుకు ఒక ఆటో కేటాయించి తడి చెత్తను ఎరువుగా మార్చేందుకు పొడి చెత్తను ప్రైవేట్‌ సంస్థల ద్వారా విక్రయిం చేందుకు కొత్త పాలసీని తీసుకురా నుం ది. దీంతో ఈ డంపింగ్‌ యార్డులోని చెత్త సమస్య అతి త్వర లోనే పరిష్కారం అవుతుంది.  

– కేవీ పద్మావతి, మున్సిల్‌ కమిషనర్‌



Updated Date - 2021-03-23T05:10:37+05:30 IST