వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా గవర్నర్‌గా డాక్టర్‌ సూర్యారావు

ABN , First Publish Date - 2021-12-19T06:03:49+05:30 IST

వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా గవర్నర్‌గా 2022 ఏడాదికి పారిశ్రామికవేత్త డాక్టర్‌ యిర్రింకి సూర్యారావు నియమితులయ్యారు.

వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా గవర్నర్‌గా డాక్టర్‌ సూర్యారావు
డాక్టర్‌ సూర్యారావును అభినందిస్తున్న మంత్రి శ్రీనివాస్‌

భీమవరం ఎడ్యుకేషన్‌, డిసెంబరు 18 : వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా గవర్నర్‌గా 2022 ఏడాదికి పారిశ్రామికవేత్త డాక్టర్‌ యిర్రింకి సూర్యారావు నియమితులయ్యారు. విజయవాడ సమీపంలో సీఏ కన్వెన్షన్‌లో వాకర్స్‌ ఇంటర్నేషనల్‌ 30వ వార్షిక సమావేశం శనివారం నిర్వహించారు. 201 (పశ్చిమ గోదావరి) డిస్ట్రిక్‌ గవర్నర్‌గాను, ఎండోమెంట్‌ డోనర్‌గానూ ఆయన ఎన్నికకావడంతో రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చేతుల మీదుగా సత్కరించారు. వాకర్స్‌ ఇంటన్నేషనల్‌ అధ్యక్షుడు టి.హనుమంతరావు, భీమవరం డీఎన్నార్‌ వాకర్స్‌ అసోసియేషన్‌ తరపున భీమాల శ్రీరామమూర్తి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T06:03:49+05:30 IST