ఎంత ఖర్చయినా.. తీసుకొద్దాం..
ABN , First Publish Date - 2021-02-07T05:21:52+05:30 IST
పంచాయతీ బరిలో అభ్యర్థుల చూపు దూరప్రాంతాలలో ఉన్న ఓటర్లుపై పండింది.

భీమవరం రూరల్/వీరవాసరం, ఫిబ్రవరి 6 : పంచాయతీ బరిలో అభ్యర్థుల చూపు దూరప్రాంతాలలో ఉన్న ఓటర్లుపై పండింది. వార్డు సభ్యులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. బయట ఉన్న పది ఓట్లే కీలకం అని ఆలోచిస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడలో ఉన్న ఓటర్లకు కార్లు ఏర్పాటుచేసే పనిలో ఉన్నా రు. వారి బంధువుల ద్వారా సమాచారం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరవాసరం గ్రామానికి చెందిన వారు ఉద్యోగ, ఉపాధి నిమిత్తం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తదితర నగరాల్లో ఉన్నారు. ఇటీవల సంక్రాంతి పండుగకు వచ్చి తిరిగి వెళ్ళినవారే. ఇంతలోనే పంచాయతీలో ఎన్నికలు రావడంతో పోటీ అభ్యర్థులకు అవసరం వచ్చింది. నాయకులు, అభ్యర్థులు ఫోన్ నెంబర్లతో సంప్రదిస్తున్నారు. వారి ఓట్లే కీలకంగా భావించి రానుపోనూ ఖర్చులకోసం ఫోన్ పే, గూగుల్ పేతో సొమ్ము పంపాలని అనుచరులకు ఆదేశాలు ఇస్తున్నారు.
–––––––––––––––––––––––