కుటుంబ సభ్యులే వలంటీర్లు !

ABN , First Publish Date - 2021-05-21T05:16:56+05:30 IST

భీమవరం పురపాలక సంఘంలో వలంటీర్ల పేరిట వేతనాలు స్వాహా చేసిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ భాగోతం వెలుగుచూసింది.

కుటుంబ సభ్యులే వలంటీర్లు !

వేతనాలు స్వాహా  చేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌

భీమవరం, మే 20 : భీమవరం పురపాలక సంఘంలో వలంటీర్ల పేరిట వేతనాలు స్వాహా చేసిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ భాగోతం వెలుగుచూసింది. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ తతంగంపై అధికారులు దృష్టి సారించి గురువారం విచారణ చేపట్టారు. దీనికి సూత్రధారిగా వ్యవహరించిన ఆపరేటర్‌ శ్రీకాంత్‌ను విచారించారు. సదరు ఆపరేటర్‌ ముగ్గురి పేరున ఇంత వరకూ రూ.60 వేల వేతనాలు డ్రా చేసినట్టు గుర్తించారు. వార్డులలో ప్రజలకు సంబంధించిన అంశాలపై పట్టున్న సదరు ఆపరేటర్‌ విధుల నుంచి తప్పుకొన్న వలంటీర్ల స్థానంలో తన భార్య, చెల్లెలు, బావమరిది పేర్లను కమిషనర్‌ లాగిన్‌ ఐడీ ద్వారా చేర్చి వేతన బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా తిరిగి తానే అందుకున్నట్లు వెల్లడైంది. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.శ్యామల మాట్లాడుతూ అవతకవలు జరిగినట్లు విచారణలో తేలిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-05-21T05:16:56+05:30 IST