విద్యుదాఘాతంతో వలంటీర్‌ మృతి

ABN , First Publish Date - 2021-07-13T04:49:37+05:30 IST

వేలాడుతున్న విద్యుత్‌ వైరు అతని పాలిట యమపాశమైంది.

విద్యుదాఘాతంతో వలంటీర్‌ మృతి
శివ (ఫైల్‌)

టి.నరసాపురం, జూలై 12: వేలాడుతున్న విద్యుత్‌ వైరు అతని పాలిట యమపాశమైంది. విద్యుదాఘాతంతో వలంటీర్‌ మృతి చెందిన ఘటన ఇది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం మర్రిగూడెం పంచాయతీ సున్నపు రాళ్లపల్లి గ్రామంలో మొడియం శివ (28) గ్రామ వలంటీరుగా పనిచేస్తున్నాడు. సోమవారం వర్షం  కురవడంతో పామాయిల్‌ తోటలోకి గొడుగేసుకుని వెళ్లాడు. కిందికి  వేలాడుతున్న 11 కేవీ విద్యుత్‌ వైరు గొడుగుకు తగలడంతో శివ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టి.నరసాపురం ఎస్‌ఐ కె.రామకృష్ణ తెలిపారు. 


Updated Date - 2021-07-13T04:49:37+05:30 IST