విజయ డెయిరీ కార్మికులను కొనసాగించాలి

ABN , First Publish Date - 2021-06-23T04:45:53+05:30 IST

విజయ డెయిరీలో 15 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులను అర్ధాంతరంగా వెళ్లిపోవాలని నోటీసులు ఇవ్వడం దారుణమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌.లింగరాజు అన్నారు.

విజయ డెయిరీ కార్మికులను కొనసాగించాలి
విజయ పాల డెయిరీ వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులు

ద్వారకాతిరుమల, జూన్‌ 22: విజయ డెయిరీలో 15 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికులను అర్ధాంతరంగా వెళ్లిపోవాలని నోటీసులు ఇవ్వడం దారుణమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌.లింగరాజు అన్నారు. జి.కొత్తపల్లి విజయ డెయిరీని అమూల్‌ డెయిరీకి మార్పుచేసి 70 మంది కార్మికులను తొలగించ డం అన్యాయమన్నారు. కార్మికుల తొలగింపును నిరసిస్తూ మంగళవారం ధర్నా చేపట్టారు. లింగరాజు మాట్లాడుతూ విజయ డెయిరీలో కార్మికులను అమూల్‌ కంపెనీలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులను కొనసాగించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. స్థానిక ఫ్యాక్టరీలో 70 శాతం మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినా తొలగింపుతో వీధిన పడ్డార న్నారు. ఆందోళన కార్యక్రమంలో సాల్మన్‌రాజు, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T04:45:53+05:30 IST