విద్యుత్‌ సవరణ బిల్లులు ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-08-11T05:23:35+05:30 IST

విద్యుత్‌ సరవణ 2021 బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైౖర్మన్‌ ఎం. రమేష్‌ అన్నారు.

విద్యుత్‌ సవరణ బిల్లులు ఉపసంహరించుకోవాలి
విద్యుత్‌ కార్యాలయం వద్ద ఉద్యోగుల నిరసన

ఏలూరు టూటౌన్‌, ఆగస్టు 10: విద్యుత్‌ సరవణ 2021 బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైౖర్మన్‌ ఎం. రమేష్‌ అన్నారు. విద్యుత్‌ భవన్‌లో మంగళవారం ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బిల్లును ఉపసంహరించు కోని పక్షంలో  దేశ వ్యాప్త సమ్మెకు సిద్దమవుతామన్నారు. ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టాలన్నారు. డిస్కిం కన్వీనర్‌ భూక్యా నాగేశ్వరరావు నాయక్‌ మాట్లాడుతూ సహజ ఇంధన వనరులను ప్రైవేటు పెట్టుబడిదారులకు దారాదత్తం చేయడం సహించమన్నారు. విద్యుత్‌ సరవణ బిల్లును రాష్ట్రంతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల ఓసీ అసోసియేషన్‌ కార్యదర్శిఽ తురగా రామకృష్ణ మాట్లాడుతూ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలంతా విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాల న్నారు. ఈ బిల్లు చట్టమైతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కూడా తొలగిస్తారన్నారు. విద్యుత్‌ సవరణ బిల్లుకు ఎటువంటి పోరాటాలకైనా ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఈ జనార్దనరావు, జేఏసీ జిల్లా కన్వీనర్‌ ఎ.రాము, కో–కన్వీనర్‌ ఆర్‌. భీమేశ్వరరావు, డిప్లమో ఇంజనీర్‌ అసోసియేషన్‌ నాయకులు సుబ్బారావు, వి.సాయిబాబా, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-11T05:23:35+05:30 IST