వైభవంగా శ్రీవారి కోవెల ఉత్సవం

ABN , First Publish Date - 2021-12-19T06:09:37+05:30 IST

వేంకటేశ్వరస్వామి ఆల యంలో ధనుర్మాస ఉత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం కోవెల ఉత్సవం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా శ్రీవారి కోవెల ఉత్సవం
ఆలయ ప్రాంగణంలో కోవెల ఉత్సవం

ద్వారకా తిరుమల, డిసెంబరు 18 : వేంకటేశ్వరస్వామి ఆల యంలో ధనుర్మాస ఉత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం కోవెల ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రతీ ఏటా ధనుర్మాసంలో శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నిత్యం ఉద యం వేళ తిరువీధుల్లో విహరిస్తారు. కరోనా మహమ్మారి విజృం భించిన నాటి నుంచి తిరువీధి సేవలు రద్దయ్యాయి.  దీంతో ఆలయంలో కోవెల ఉత్సవాన్ని జరిపారు. ముందుగా తొళక్కం వాహనంపై ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం గోవింద నామ స్మరణాల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామి వారి వాహనం తిరుగాడింది. నైరుతీమండపంలో స్వామి, అమ్మవార్లను ఉంచి పూజలు చేసి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ప్రతి శనివారం వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. శని వారం నామమాత్రంగా భక్తులు రావడంతో ఆలయంలోని అన్ని విభాగాలు దాదాపు ఖాళీగా కన్పించాయి. 

Updated Date - 2021-12-19T06:09:37+05:30 IST