వైభవంగా శ్రీచక్ర స్నానం

ABN , First Publish Date - 2021-05-09T04:44:59+05:30 IST

వేంకటేశ్వరస్వామి ఉపాలయమైన లక్ష్మీపురం భూ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించారు.

వైభవంగా శ్రీచక్ర స్నానం
లక్ష్మీపురంలో స్వామి అమ్మవార్లకు శ్రీచక్ర స్నానం

ద్వారకాతిరుమల, మే 8: వేంకటేశ్వరస్వామి ఉపాలయమైన లక్ష్మీపురం భూ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో  కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూ ఏకాంత సేవలో స్వామి వారి కల్యాణోత్సవాలు నిర్వహించారు. శనివారం స్వామివారి శ్రీచక్ర స్నాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో స్వామి, అమ్మవార్లకు సుగంధ ద్రవ్య జలాలతో శ్రీచక్ర స్నాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏకాంత సేవలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. సాయత్రం స్వామివారి దేవాలయంలో ధ్వజారోహణ, మౌన బలిహరణ కార్యక్రమం నిర్వహించారు. ఈవో సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T04:44:59+05:30 IST