పారిజాతగిరిపై వెంకన్న కల్యాణం

ABN , First Publish Date - 2021-08-22T05:19:11+05:30 IST

గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంకన్న కల్యాణం వైభవంగా జరిగింది.

పారిజాతగిరిపై వెంకన్న కల్యాణం
పారిజాతగిరిపై శ్రీవారి కల్యాణ వేడుక

జంగారెడ్డిగూడెం, ఆగస్టు 21: గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంకన్న కల్యాణం వైభవంగా జరిగింది. శనివారం ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, తదితర పూజా కార్య క్రమాలను నిర్వహించారు. స్వామి వారి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కల్యాణో త్సవం ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమార్‌ఆచార్యులు నిర్వహించారు. ఆలయం మొత్తం సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో స్ర్పే చేశారు. కొవిడ్‌ నిబంధనల నడుమ భక్తులకు దర్శనం కల్పించినట్టు ఆలయ ఈవో ఎంఎస్‌ఎస్‌ సంగమేశ్వరశర్మ, చైర్మన్‌ ఉప్పల గంగాధరం తెలిపారు.

Updated Date - 2021-08-22T05:19:11+05:30 IST