వీరభద్రుడికి గండ దీపాలతో ఆరాధన
ABN , First Publish Date - 2021-02-27T04:49:40+05:30 IST
కామవరపుకోట భద్రకాళీ సహి త వీరభద్రస్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా శు క్రవారం భక్తులు శిరస్సుపై గండ దీపాలు పెట్టుకుని ఆలయ ప్ర దక్షిణలు నిర్వహించి స్వామిని దర్శించుకున్నారు.

కామవరపుకోట, ఫిబ్రవరి 26 : కామవరపుకోట భద్రకాళీ సహి త వీరభద్రస్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా శు క్రవారం భక్తులు శిరస్సుపై గండ దీపాలు పెట్టుకుని ఆలయ ప్ర దక్షిణలు నిర్వహించి స్వామిని దర్శించుకున్నారు. తేలీల సంఘం ప్రతినిధులు ప్రదర్శించిన నారస ములు భక్తులను ఆకట్టుకున్నా యి. అనతంరం నంది వాహనం పై స్వామిని అలంకరించి గ్రా మంలో ప్రదర్శన జరిపి కల్యాణ వేదిక వద్దకు తోడ్కొని వచ్చారు. మేళ తాళా లు, వేద మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ మహోత్సవం శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, పరిసరాల్లో విద్యుద్ధీపాలకరణ ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఏర్పాట్లు పర్యవేక్షించారు.