వాలీబాల్‌ పోటీల విజేత మాధవరం

ABN , First Publish Date - 2021-10-21T04:59:02+05:30 IST

తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో వాలీబాల్‌ పోటీలను యుబీఐ బ్యాంకు పరిధి లోని గ్రామాల వారితో బుధవారం నిర్వహిం చారు.

వాలీబాల్‌ పోటీల విజేత మాధవరం
బహుమతి అందిస్తున్న సర్పంచ్‌

తాడేపల్లిగూడెం రూరల్‌, అక్టోబరు 20: తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో వాలీబాల్‌ పోటీలను యుబీఐ బ్యాంకు పరిధి లోని గ్రామాల వారితో బుధవారం నిర్వహిం చారు.  ఏడు జట్లు ఈ పోటీల్లో పాల్గొనగా మాధవరం–ఎ మొదటిస్థానంలో నిలిచి రూ.5 వేలు నగదు బహుమతి అందుకుంది. రెండో స్థానంలో నిలిచిన వెంకట్రావుపాలెం జట్టు రూ.3 వేలు, మాధవరం–బి జట్టు మూడో బహుమతిగా రూ.2 వేలు సర్పంచ్‌ సూర్యకుమారి అందించారు. బ్యాంకు మేనే జర్‌ చైతన్య కుమార్‌, నాయకులు బాలం కృష్ణ, రాజబాబు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-21T04:59:02+05:30 IST