వడ్డిగూడెంలో మూడుసార్లు ఏకగ్రీవం.. ఈ సారి తప్పని పోటీ

ABN , First Publish Date - 2021-02-02T05:22:12+05:30 IST

వడ్డిగూడెం మైనర్‌ పంచాయతీ. 1994లో వీరవాసరం పంచాయతీ నుండి విడివడి ప్రత్యేక పంచాయతీ అయింది.

వడ్డిగూడెంలో మూడుసార్లు ఏకగ్రీవం.. ఈ సారి తప్పని పోటీ

వీరవాసరం, ఫిబ్రవరి 1: వడ్డిగూడెం మైనర్‌ పంచాయతీ. 1994లో వీరవాసరం పంచాయతీ నుండి విడివడి ప్రత్యేక పంచాయతీ అయింది. 1995 ఎన్నికల్లో ప్రథమ సర్పంచ్‌గా నేపాళ సుబ్బారావు ఎన్నికయ్యారు. 2001, 2006, 2013 ఎన్నికల్లో ఏకగ్రీవమై హ్యాట్రిక్‌ సాధించింది. గ్రామస్థులు ఐక్యతతో సర్పంచ్‌, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకున్నారు. ఐక్యతకు, కట్టుబాట్లకు విలువనిచ్చే గ్రామం నేడు పంచాయతీ ఎన్నికల్లో పోరుకు సిద్ధమైంది. గ్రామస్థులు ఐక్యతతో ఏకగ్రీవ సన్నాహాలు చేసినప్పటికీ ఫలించకపోవడంతో వైసీపీ, టీడీపీ, జనసేన మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు ఉపసంహరణ నాటికి ఐక్యతకు విలువనిస్తారా అని గ్రామస్థులు ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2021-02-02T05:22:12+05:30 IST