వ్యాక్సిన్‌ ఉన్నా ... వేయరా..

ABN , First Publish Date - 2021-05-19T04:48:05+05:30 IST

ఒక పక్క కరోనా కేసులు పెరుగుతున్నా.. వ్యాక్సిన్‌ వేయడంలో మాత్రం ఇంకనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది.

వ్యాక్సిన్‌ ఉన్నా ... వేయరా..

వీరవాసరం, మే 18 : ఒక పక్క కరోనా కేసులు పెరుగుతున్నా.. వ్యాక్సిన్‌ వేయడంలో మాత్రం ఇంకనూ నిర్లక్ష్యమే కనిపిస్తోంది. అయితే చాలా మంది మాత్రం వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. మరో పక్క వ్యాక్సిన్‌ ఉన్నా వేయడంలేదు.  గత రెండు రోజులుగా పీహెచ్‌సీల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడం లేదు. వ్యాక్సిన్‌ ఉన్నప్పటికీ అధికారుల నుంచి ఆదేశాలు రాకపోవడంతో వ్యాక్సిన్‌ వేయడం నిలిచిపోయింది. వీరవాసరం పీహెచ్‌సీలో 60 డోసులు కో వాగ్జిన్‌, 120 డోసులు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది. కొణితివాడ పీహెచ్‌సీలో 90 డోసుల కోవిషీల్డ్‌ ఉంది. మొదటి డోసు టీకా తీసుకున్న వారు రెండో డోసు తీసుకోవడినికి వ్యవధి  28 రోజుల నుంచి 42 రోజులకు పెంచినప్పటికీ అర్హులు ఉన్నారు. అయినప్పటికీ టీకా వేయకపోవడంతో టీకా కోసం వచ్చిన వారు నిరాశగా తిరుగుతున్నారు. 

Updated Date - 2021-05-19T04:48:05+05:30 IST