వ్యాక్సినేషన్‌ ముమ్మరం

ABN , First Publish Date - 2021-05-30T05:48:39+05:30 IST

నగరంతో పాటు గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఏలూరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో రెండు వేల మందికి శనివారం వ్యాక్సినేషన్‌ వేశామని నగర కమిషనర్‌ డి. చంద్రశేఖర్‌ తెలిపారు.

వ్యాక్సినేషన్‌ ముమ్మరం
దెందులూరులో రెండో డోసు వేస్తున్న వైద్య సిబ్బంది

ఏలూరు టూటౌన్‌, మే 29 : నగరంతో పాటు గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఏలూరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో రెండు వేల మందికి శనివారం వ్యాక్సినేషన్‌ వేశామని నగర కమిషనర్‌ డి. చంద్రశేఖర్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ వేస్తున్న సెంటర్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. వ్యాక్సిన్‌ను నిబంధనలు పాటిస్తూ ప్రతి సెంటర్‌ వద్ద కార్యక్రమం  చేపట్టామన్నారు. సీనియర్‌ సిటిజన్లకు ఇబ్బంది లేకుండా భౌతిక దూరం పాటిస్తూ వారికి కుర్చీలు వేశామన్నారు. 

వెంకటాపురంలో 280 మందికి..
ఏలూరు రూరల్‌, మే 29 : ప్రభుత్వాదేశాల మేరకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సచివాలయాల్లో నిర్వహించారు. 45 ఏళ్లు దాటిన అన్ని వర్గాల ప్రజలకు 280 మందికి రెండో డోసు కొవాగ్జిన్‌ శనివారం వేశారు. రూరల్‌ మండలంలో వెంకటాపురం పంచాయతీ సచివాలయంలో కొవాగ్జిన్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇన్‌చార్జి ఎంపీడీవో సరళకుమారి, తహసీల్దార్‌ సోమశేఖర్‌ వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు.
600 మందికి రెండో డోసు కొవాగ్జిన్‌
దెందులూరు, మే 29 : కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికి మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటిం చాలని దెందులూరు తహసీల్దార్‌ నాంచారయ్య, ఎంపీడీవో లక్ష్మి అన్నారు. శనివారం మండల కార్యాలయంలో వారు మాట్లాడుతూ దెందులూరు మండలంలో 45 ఏళ్లు దాటిన మొదటి విడత వేయించుకున్న 600 మందికి రెండో డోసు కొవాగ్జిన్‌ వేశారన్నారు.  మండలంలో కొత్తగూడెం, సీతంపేట, కొమిరేపల్లిలో 150 మందికి, పోతునూరు పరిధిలో 50 మందికి, దెందులూరు పరిధిలో 200 మందికి, రామారావుగూడెం పంచాయతీ పరిధిలో 200 మందికి కొవాక్జిన్‌ వ్యాక్సిన్‌ వేశామన్నారు. వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
పెదపాడులో 390 మందికి.. 
పెదపాడు, మే 29 : పెదపాడులో 210 మందికి, వట్లూరు పీహెచ్‌సీ పరిధి కలపర్రులో 180 మందికి రెండో  డోస్‌ వ్యాక్సిన్లను శనివారం అందజేశామని వైద్య అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-05-30T05:48:39+05:30 IST