వ్యాక్సినేషన్‌కు రెండు రోజులు ఆగాల్సిందే

ABN , First Publish Date - 2021-07-24T05:35:04+05:30 IST

వ్యాక్సిన్‌ నిల్వలు ఖాళీ అయిన నేపథ్యంలో జిల్లాలో మళ్ళీ వ్యాక్సినేషన్‌ సోమవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

వ్యాక్సినేషన్‌కు రెండు రోజులు ఆగాల్సిందే

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూలై 23: వ్యాక్సిన్‌ నిల్వలు ఖాళీ అయిన నేపథ్యంలో జిల్లాలో మళ్ళీ వ్యాక్సినేషన్‌ సోమవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు    ఉన్నాయి. రాష్ట్రానికి కొత్తగా వ్యాక్సిన్‌ నిల్వలు అందుతాయన్న సమాచారంతో ఈ అంచనాకు వచ్చినట్టు ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అందుబాటులో ఉన్న కొవాగ్జిన్‌ నిల్వలను రెండో డోసు లబ్ధిదారులకు మాత్రమే పరిమితం చేయడంతో జిల్లాలో శుక్రవారం 1025 మందికి టీకా పంపిణీ జరిగింది.


Updated Date - 2021-07-24T05:35:04+05:30 IST