తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్‌చార్జిగా బాబ్జి
ABN , First Publish Date - 2021-02-02T05:33:18+05:30 IST
తాడేపల్లి గూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా వలవల బాబ్జిని పార్టీ అధిష్టానం నియమించింది.
తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): తాడేపల్లి గూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా వలవల బాబ్జిని పార్టీ అధిష్టానం నియమించింది. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్‌గా వున్న ఈలి నానిని పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నా యుడును కలవాలని సూచించింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో బాబ్జి క్రియాశీలంగా వ్యవహరిస్తూ అధిష్ఠానం సూచన మేరకు అన్నిస్థానాల్లోనూ పోటీ ఉండేలా ప్రయత్నిస్తున్నారు. బాబ్జి రాజకీయాల్లో సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. ఆయన రవాణా, నిర్మాణ రంగాంల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తుండటంతో తాజాగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.