55 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-11-29T05:10:21+05:30 IST

ప్రభుత్వం వెం టనే 55 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించి 2018 జూలై నుంచి అమలు చేయా లని యూటీఎఫ్‌ జిల్లా ప్రధా న కార్యదర్శి గోపీమూర్తి డి మాండ్‌ చేశారు.

55 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలి

ఏలూరు ఎడ్యుకేషన్‌, న వంబరు 28 : ప్రభుత్వం వెం టనే 55 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని ప్రకటించి 2018 జూలై నుంచి అమలు చేయా లని యూటీఎఫ్‌ జిల్లా ప్రధా న కార్యదర్శి గోపీమూర్తి డి మాండ్‌ చేశారు. ఏలూరులోని సంఘ జిల్లా కార్యాలయంలో యూటీఎఫ్‌ కార్యవర్గ సమావేశం ఆదివారం జరి గింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల మేరకు జీవోలు జారీ చేయాలని కోరారు. విద్యా సంస్కరణల పేరుతో ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లోకి విలీనం చేయడం వల్ల ఏర్పడిన సమస్యలను పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఏకో పాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని, నూతన డీఎస్సీ నియామకాలు జరిగేలోగా అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘ జిల్లా అధ్యక్షుడు జయకర్‌, రత్నరాజు, రాంబాబు, బాలకృష్ణ, జయకుమార్‌, అప్పారావు, సుధారాణి, బాబ్జీ, రమణ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T05:10:21+05:30 IST