ఉపాధి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు

ABN , First Publish Date - 2021-11-26T05:35:30+05:30 IST

ఉపాధి హామీ పథకం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు.

ఉపాధి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు

ఏలూరు రూరల్‌, నవంబరు 25: ఉపాధి హామీ పథకం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. రాగాస్‌ సాఫ్ట్‌వేర్‌ను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్టు కేంద్రం అభిప్రా యపడింది. గత నెలలో తనిఖీల తరువాత ప్రత్యేక బృందం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయంగా నరేగా సాఫ్ట్‌వేర్‌ను తెచ్చింది. ఉపాధి హామీ పథకం లావాదేవీలన్నీ కొత్త సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా సాగనున్నాయి. ఇప్ప టివరకు రాగాస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కూలి డబ్బులు, పనులు చేపట్టిన సర్పంచ్‌లకు చెల్లింపులు జరిగేవి. తెలుగుదేశం ప్రభుత్వంలో పనులు చేపట్టిన అప్పటి సర్పంచ్‌లకు చెల్లింపులు నిలిపి వేయడం, కూలీలకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపో వడం, కేంద్రం మంజూరు చేసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడం వంటి వాటిపై ఫిర్యాదులు వెళ్ళడంతో కేంద్రం కఠిన ఆంక్షలను విధించింది. కొత్త సాఫ్ట్‌వేర్‌ను జిల్లాలో అధికారులు వేగవంతంగా మార్పు చేశారు.

Updated Date - 2021-11-26T05:35:30+05:30 IST