‘ఉపా చట్టాన్ని రద్దు చేయాలి’
ABN , First Publish Date - 2021-01-21T04:37:23+05:30 IST
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మేధావులు, ప్రొఫె సర్లపై ఉపా చట్టం (అన్‌లాఫుల్ ప్రివెన్సన్ యాక్టు) ప్రయోగిస్తూ ఏళ్ల తరబడి అండర్ ట్రయిల్ ముద్దాయిలుగా జైల్లో నిర్బంధించడం తగదని ఉపా చట్టం పోరాట కమిటీ, ప్రజా సంఘాల నేతలు ధ్వజమెత్తారు.

తాళ్లపూడి, కొవ్వూరు 20:కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మేధావులు, ప్రొఫె సర్లపై ఉపా చట్టం (అన్‌లాఫుల్ ప్రివెన్సన్ యాక్టు) ప్రయోగిస్తూ ఏళ్ల తరబడి అండర్ ట్రయిల్ ముద్దాయిలుగా జైల్లో నిర్బంధించడం తగదని ఉపా చట్టం పోరాట కమిటీ, ప్రజా సంఘాల నేతలు ధ్వజమెత్తారు. కొవ్వూరు బస్టాండ్ వద్ద కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ నెలరోజులుగా రాష్ట్రంలో కూడా పోలీసులు ప్రజాసంఘాల నాయకులను అక్రమ అరెస్టులకు పాల్పడుతూ ఉపా చట్టం ప్రయోగిస్తున్నారని ఆక్రోశించారు. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని, అరెస్టు చేసిన సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ నాయకురాలు ఈ.మల్లిక, ఐఎఫ్‌టీయూ నాయకులు సీహెచ్ రమేశ్, పీడీఎస్‌యూ నాయకులు మహర్షి, బి. మహేందర్, సీఎల్‌సీ నాయకులు ఎన్.వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు