బాలికపై వేధింపులు.. ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2021-06-22T07:37:24+05:30 IST

బాలికను వేధించిన వ్యక్తితోపాటు, అతని స్నేహితుడిని అరెస్టు చేసినట్లు సీఐ చైతన్యకృష్ణ తెలిపారు.

బాలికపై వేధింపులు.. ఇద్దరి అరెస్టు

తణుకు, జూన్‌ 21: బాలికను వేధించిన వ్యక్తితోపాటు, అతని స్నేహితుడిని అరెస్టు చేసినట్లు  సీఐ  చైతన్యకృష్ణ  తెలిపారు. సోమవారం పట్టణ పోలీసు స్టేషన్‌ లో ఆయన విలేకరులకు తెలిపిన వివరాలివి.. రావులపాలెంకు చెందిన గొలుగూరి జయరాంరెడ్డి చెల్లెలు, తణుకుకు చెందిన బాలిక స్నేహితులు. వారి స్నేహాన్ని  ఆసరాగా తీసుకున్న జయరాంరెడ్డి సామాజిక మాద్యమాల ద్వారా బాలికను  వేధించేవాడు. ఆమె స్కూటీకి జీపీఎస్‌ ట్రాకర్‌ను నిందితుడి స్నేహితుడైన గొలుగురి జగన్మోహనరెడ్డి ద్వారా అమర్చాడు. దీని ద్వారా ఆమె కదలికలను కనిపెట్టి వేధిస్తుం డడంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడితోపాటు అతడి స్నేహితు డిని తణుకులో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పట్టణ పోలీసులు పోస్కో, ఐటీ యాక్టులతోపాటు పలు  సెక్షన్లు కింద కేసు నమోదు చేశారన్నారు. ఎస్‌ఐ గంగాధరరావు, ఏఎస్‌ఐ పోలయ్య కాపు, కానిస్టేబుళ్లు అన్వర్‌, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు సహకరించారన్నారు.


Updated Date - 2021-06-22T07:37:24+05:30 IST