ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమేనా!

ABN , First Publish Date - 2021-08-11T04:28:42+05:30 IST

ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం.. ఇదీ ఆర్టీసీ స్లోగన్‌.. కొన్ని బస్సుల పరిస్థితి చూస్తే ఈ స్లోగన్‌ వెనక్కు తీసు కోవా ల్సిందే.

ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమేనా!
భీమవరంలో విరిగిన బెడ్‌కు మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

రెండు భీమవరం డిపో బస్సులకు విరిగిన బెడ్‌లు

సురక్షితంగా ప్రయాణికులు


భీమవరం క్రైమ్‌, ఆగస్టు 10 :  ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం.. ఇదీ ఆర్టీసీ స్లోగన్‌.. కొన్ని బస్సుల పరిస్థితి చూస్తే ఈ స్లోగన్‌ వెనక్కు తీసు కోవా ల్సిందే. ఎందు కంటే అంత ప్రమాదకరంగా ఉం టున్నాయి. అయినా డిపో సిబ్బంది తీసుకుంటున్న చర్యలు శూన్యం. భీమవరం ఆర్టీసీ డిపోకు చెందిన రెండు బస్సుల్లో ప్రయాణికులకు మంగళవారం ఎదురైన సంఘటనలే దీనికి ఉదాహరణ.. విజయవాడ నుంచి భీమవరం వస్తున్న ఏపీ 37 జెడ్‌ 171 బస్సు నటరాజ్‌ ఽథియేటర్‌ దగ్గరకు వచ్చేసరికి వెనుక బెడ్‌ విరిగి డివైడర్‌ ఎక్కింది. ఆ సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నారు.ఎటువంటి ప్రమాదం జరగకుండా బస్‌ నిలిచిపోవ డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.అలాగే ఉదయం 7 గంటలకు భీమవరం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు కాళ్ళ మండలం సీసలి వద్ద వెనుక ఉన్న 2 బెడ్‌లు విరిగి నేలకొరిగింది.ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవ రికి ఏమి జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.  బస్సులను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన డిపో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణా లకు రక్షణ లేకుండాపోతోంది. దీనిపై భీమవరం ఆర్టీసీ డీఎం మహేంద్రుడును వివరణ కోరగా బస్సు బెడ్‌లు దగ్గర ఉన్న స్ర్పింగ్‌ల మరమ్మతులకు గురవడం, ఏలూరుపాడు నుంచి భీమవరం రోడ్డులో గోతులు వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. 

Updated Date - 2021-08-11T04:28:42+05:30 IST