చేప పిల్లల పెంపకంపై మత్స్యకారులకు శిక్షణ

ABN , First Publish Date - 2021-10-29T04:59:49+05:30 IST

పోలవరం స్వదేశీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు చేప పిల్లల పెంపకంపై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

చేప పిల్లల పెంపకంపై మత్స్యకారులకు శిక్షణ
శిక్షణ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు

పోలవరం, అక్టోబరు 28: పోలవరం స్వదేశీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు చేప పిల్లల పెంపకంపై గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఙాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.దే వీవరప్రసాద్‌ రెడ్డి నర్సరీల్లో చేప పిల్లల యాజమాన్యం, చేపల్లో వచ్చే వ్యాధులు, నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. మత్స్య శాఖ ఏడీ సైదానాయక్‌ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల రికార్డుల నిర్వహణపై అవగాహన కల్పించారు. మత్స్యకారులకు గుర్తింపు కార్డులు, చేపల వేటకు లైసెన్సు మంజూరు తదితర అంశాలను వివరించారు. మత్స్య కారులు 50 మందికి ద్విచక్ర వాహనాలు మంజూరు చేయాలని అధికారులను కోరారు. ఏపీఐఐఏటీఎఫ్‌ ప్రాజెక్టు ప్రతినిధులు ప్రవీణ్‌ కుమార్‌, అచ్యుతరావు, రాజారావు, మత్స్య సహకార సంఘ అధ్యక్షుడు ముంగర వెంకటేశ్వర్లు, ముంగర వెంకట్రావు, మత్స్యశాఖ ఇన్‌స్పెక్టర్‌ దేవానందం, సహాయకురాలు జయ ఫీల్డ్‌మేన్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T04:59:49+05:30 IST