ట్రాక్టర్‌ బోల్తాపడి ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-11-01T05:16:08+05:30 IST

మండలంలోని ఊనగట్లలో ట్రాక్టర్‌ బోల్తాపడి కుడుపూడి గోపి (41) మృతి చెందాడు.

ట్రాక్టర్‌ బోల్తాపడి ఒకరి మృతి

చాగల్లు, అక్టోబరు 31: మండలంలోని ఊనగట్లలో ట్రాక్టర్‌ బోల్తాపడి కుడుపూడి గోపి (41) మృతి చెందాడు. ఎస్‌ఐ వెంకట రమేష్‌ తెలిపిన వివరాలు ప్రకారం ఆచంటకు చెందిన గోపి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. పంగిడి నుంచి ట్రాక్టర్‌పై క్వారీ మెటల్‌ ఆచంటకు తరలిస్తుండగా ఊనగట్ల శివారులో శనివారం రాత్రి ట్రాక్టరు కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొంది. ట్రాక్టర్‌ బోల్తాపడడంతో దాని కింద చిక్కుకున్న గోపి మృతి చెందాడు. మృతుడి తండ్రి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదివారం చెప్పారు.


Updated Date - 2021-11-01T05:16:08+05:30 IST