వర్షాలకు నష్టపోయిన పొగాకు రైతులను ఆదుకుంటాం

ABN , First Publish Date - 2021-11-29T04:56:21+05:30 IST

వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకో డానికి కృషి చేస్తామని పొగాకు బోర్డు చైర్మన్‌ జె.రఘునాథబాబు అన్నారు.

వర్షాలకు నష్టపోయిన పొగాకు రైతులను ఆదుకుంటాం
పొగాకు నారుమడి పరిశీలిస్తున్న బోర్డు చైర్మన్‌ రఘునాథబాబు

కొయ్యలగూడెం, నవంబరు 28: వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకో డానికి కృషి చేస్తామని పొగాకు బోర్డు చైర్మన్‌ జె.రఘునాథబాబు అన్నారు. మండలంలో యర్రంపేట, గవరవరం గ్రామాల్లో వర్షాలకు నష్టపోయిన పొగాకు తోటలను ఆదివారం ఆయన పరిశీలించారు. నిరంతరాయంగా వర్షాలు కురవడం వలన పొగాకు, వరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింద న్నారు. పొగాకు తోటలు కొన్నిచోట్ల పాక్షికంగా, మరికొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. మళ్ళీ నాట్లు వేసుకోవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ 11,940 హెక్టార్లలో నాట్లు పడ్డాయన్నారు. డిసెంబరు 3న బోర్డు సమావేశం ఏర్పాటు చేశామని, ఆ సమావేశంలో నష్టపోయిన రైతుల గురించి చర్చిస్తామని రఘునాథబాబు చెప్పారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, బీమా సౌకర్యం కల్పించాలని రైతులు చైర్మన్‌ని కోరారు. కార్యక్రమంలో బోర్డు వైస్‌ చైర్మన్‌ నంది, ఆర్‌ఎం ప్రసాద్‌, వేలం అధికారి గ్రేస్‌, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T04:56:21+05:30 IST