పొగాకు సాగుకు యాంత్రీకరణ అవసరం

ABN , First Publish Date - 2021-10-29T05:07:41+05:30 IST

వర్జీనియా పొగాకు సాగుకు యాంత్రీకరణ అవసరమని పొగాకుబోర్డు చైర్మన్‌ రఘునాథబాబు అన్నారు.

పొగాకు సాగుకు యాంత్రీకరణ అవసరం
సమావేశంలో మాట్లాడుతున్న పొగాకు బోర్డు చైర్మన్‌ రఘునాథబాబు

జంగారెడ్డిగూడెం టౌన్‌, అక్టోబరు 28: వర్జీనియా పొగాకు సాగుకు యాంత్రీకరణ అవసరమని పొగాకుబోర్డు చైర్మన్‌ రఘునాథబాబు అన్నారు.  పొగాకు వేలం కేంద్రంలో గురువారం ప్రపంచ పొగాకు రైతుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. యాంత్రీకరణ ద్వారా ఖర్చు తగ్గించుకునే అవ కాశాలపై రైతులు దృష్టిసారించాలన్నారు. సేంద్రియ ఎరువులు వినియోగం తో లబ్ధి పొందాలని, పురుగు మందుల వాడకం తగ్గించాలని సూచించారు. రైతుల కోరిక మేరకు పొగాకు బోర్డు ద్వారా ఎరువులు సరఫరా చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. యాంత్రీకరణకు కేంద్ర ప్రభుత్వం అందించే 60శాతం రాయితీని రైతులు పొందడానికి కృషిచేస్తున్నామన్నారు. కార్యక్ర మంలో పొగాకు బోర్డు వేలం నిర్వహణ అదికారులు మహేష్‌, సత్య శ్రీని వాస్‌, పొగాకు రైతు సంఘాల నాయకులు పరిమి రాంబాబు, సత్రం వెంకట రావు, బోర్డు సభ్యులు పలువురు పొగాకు రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:07:41+05:30 IST