నేటి నుంచి ఎస్ఐ పదోన్నతికి రాత పరీక్ష
ABN , First Publish Date - 2021-11-29T05:08:50+05:30 IST
పోలీసుశాఖలో హెడ్‌కానిస్టేబుల్, ఏ ఎస్ఐలలో సీనియార్టీని బట్టి ఎస్ఐల అర్హత పరీక్షకు ఎంపికైన వారికి సోమ, మంగళవారం రాత పరీక్షలు నిర్వహిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ.మోహన్‌రావు చెప్పారు.

ఏలూరు క్రైం, నవంబరు 28: పోలీసుశాఖలో హెడ్‌కానిస్టేబుల్, ఏ ఎస్ఐలలో సీనియార్టీని బట్టి ఎస్ఐల అర్హత పరీక్షకు ఎంపికైన వారికి సోమ, మంగళవారం రాత పరీక్షలు నిర్వహిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ.మోహన్‌రావు చెప్పారు. ఏలూరు రేంజ్ పరిధిలోని ఉభయగోదావరి, కృష్ణా, విజయవాడ సిటీ, రాజమహేం ద్రవరం అర్బన్ జిల్లాల్లో ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లలో సీనియార్టీని బట్టి ఎస్ఐ ట్రైనింగ్ (సివిల్) అర్హత పరీక్షకు 97 మందిని ఎంపిక చేశారు. వారికి పెదవేగి డీటీసీలో పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు పోలీసు అధికారుల విధులను జిల్లా పోలీసు కార్యాలయంలో వివరించారు. 97 మందికి అర్హత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి ఎస్ఐలుగా పదోన్నతి కల్పించి శిక్షణకు పంపించనున్నారు. ట్రైనింగ్, పరీక్షలకు చైర్మన్‌గా డీఐజీ కేవీ.మోహన్‌రావు, సభ్యులుగా పశ్చిమ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, విజయవాడ హోంగార్డ్స్ కమాండెంట్ కేవీ.ప్రేమ్‌జిత్ వ్యవహరిస్తారు. పశ్చిమ ఏఆర్ ఏఎస్పీ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో పెదవేగి డీటీసీలో పరీక్షలను నిర్వహించనున్నారు. సమీక్షా సమావేశంలో ఏఎస్పీ ఏవీ.సుబ్బరాజు, డీటీసీ డీఎస్పీ కె.ప్రభాకరరావు, ఏలూరు సీసీఎస్ డీఎస్పీ పైడేశ్వరరావు, దిశ పోలీస్‌స్టేషన్ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ, ఏఆర్ డీఎస్పీ కృష్ణంరాజు, ఇతర జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.