యాప్‌ల భారం వద్దంటూ ఉపాధ్యాయుల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-08T05:15:51+05:30 IST

పాఠశాలల్లో బోధనకు అడ్డంకిగా మారిన యాప్‌లను రద్దు చేయాలని యూటీఎఫ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.శ్రీనివాసరావు, త్రినాథ్‌ డిమాండ్‌ చేశారు.

యాప్‌ల భారం వద్దంటూ ఉపాధ్యాయుల ఆందోళన
పెంటపాడు ఎంఈవో కార్యాలయం వద్ద యూటీఎఫ్‌ నాయకుల ఆందోళన

పెంటపాడు, అక్టోబరు 7: పాఠశాలల్లో బోధనకు అడ్డంకిగా మారిన యాప్‌లను రద్దు చేయాలని యూటీఎఫ్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.శ్రీనివాసరావు, త్రినాథ్‌ డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం మండల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ మండల గౌరవ అధ్యక్షుడు ఏవీ రామరాజు, జిల్లా కౌన్సిలర్‌ కె.మురళీ కృష్ణ, మండల కోశాధికారి పాలూరి రామకృష్ణ, హెచ్‌ఎం అపర్ణ, శైలజ తదితరులు పాల్గొన్నారు.

ఉంగుటూరు: మండలంలోని ఉపాధ్యాయులు గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం నివారిం చాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల్లో నాడు–నేడు పనులు, మధ్యాహ్న భోజనం తదితర పనుల వివరాలను ఉపాధ్యాయులు యాప్‌లలో అప్‌లోడ్‌ వంటి పనుల వల్ల బోధన కుంటుపడుతున్నదని తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

భీమడోలు: భీమడోలు మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద యూటీ ఎఫ్‌ నాయకులు నిరసన చేపట్టారు. ఉపాధ్యాయులను విద్యా బోధనకు మ్రాతమే పరిమితం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రవి కాంత్‌, జగదీష్‌, తేరా ప్రసాద్‌, బాలిన సత్యనారాయణ, మోహనరావు, జగదీష్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఉండ్రాజవరం: బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌లను రద్దుచేయాలని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఐ.రాంబాబు డిమాండ్‌ చేశారు. గురువారం యాప్‌లను రద్దు చేయాలని కోరుతూ యూటీఎఫ్‌ నాయకులు ఎంఈవో వైవీ మాణిక్యాలరావుకు వినతిపత్రం అందజేసి, నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఎస్‌.లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి డి.రామారావు తదితరులు పాల్గొన్నారు.

ఇరగవరం: బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌ల కార్యకలాపాల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని కోరుతూ ఏపీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం కావలిపురం ఉన్నత పాఠశాలలో ఇరగవరం మండల శాఖ ఏపీటీఎఫ్‌ సమావేశం నిర్వహించారు. ఏపీటీఎఫ్‌ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఐ.రాజగోపాల్‌, జిల్లా కార్యదర్శి కె.రామప్రసాద్‌, మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌.జాన్సన్‌, ఎన్‌.జయరాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-08T05:15:51+05:30 IST