గూడెంలో ఎగిరేది.. టీడీపీ జెండానే

ABN , First Publish Date - 2021-10-07T06:13:30+05:30 IST

తాడేపల్లి గూడెంలో టీడీపీ జెండా ఎగురుతుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు.

గూడెంలో ఎగిరేది.. టీడీపీ జెండానే
పార్టీ నేతలతో మాట్లాడుతున్న చంద్రబాబు.. చిత్రంలో వలవల బాబ్జి, గొర్రెల శ్రీధర్‌ తదితరులు

టీడీపీ అధినేత చంద్రబాబు 

తాడేపల్లిగూడెం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): తాడేపల్లి గూడెంలో టీడీపీ జెండా ఎగురుతుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గూడెం ఇన్‌చార్జి వలవల బాబ్జి నేతృత్వంలో నియోజకవర్గ నాయకులు, కార్యక ర్తలు బుధవారం చంద్రబాబును కలిశారు. నియోజక వర్గంలో బాబ్జికి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన తర్వాత అందరూ కలసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు.  ఇదే విధంగా కలిసి ఉంటే విజయం తథ్యమని స్పష్టం చేశారు. టీడీపీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గొర్రెల శ్రీధర్‌, నేతలు బడుగు పెద్ద, పరిమి రవికుమార్‌, కలిపర్తి వెంకట్రావు, పాతూరి రాంప్రసాద్‌చౌదరి, మద్దిపాటి ధర్మేంద్ర, పాలూరి వెంకటేశ్వ రావు, గంధం సతీష్‌, సర్పంచ్‌ పోతుల అన్నవరం, ముత్యాల సత్యనారాయణ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు. 

Updated Date - 2021-10-07T06:13:30+05:30 IST