గోతుల రహదారిపై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2021-07-25T05:04:06+05:30 IST

రహదారి గోతులపై టీడీపీ నిరసన స్వరం వినిపించింది.

గోతుల రహదారిపై టీడీపీ నిరసన
యాదవోలు – పొంగుటూరు మధ్య రోడ్డుపై నాట్లు వేసి టీడీపీ నిరసన

రహదారి గోతులపై టీడీపీ నిరసన స్వరం వినిపించింది. ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, చింతమనేని ప్రభాకర్‌ రహదారిపై గోతుల్లో నాట్లు వేసి, స్వచ్ఛందంగా గోతులు పూడ్చి నిరసన తెలియజేశారు. కొయ్యలగూడెం, దేవరపల్లి, కామవరపుకోట, చింతలపూడిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. రహదారి ధ్వంసమైనా పట్టించుకోని ప్రభుత్వంపై మండి పడ్డారు.దేవరపల్లి, జూలై 24: మండలంలోని యాదవోలు – పొంగుటూరు రహ దారిపై మొకాలి లోతు నీరు ఉండడంతో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంక టేశ్వరరావు, టీడీపీ నాయకులు శనివారం వరి నాట్లు వేసి నిరసన తెలిపా రు. రోడ్లపై తట్ట మట్టి కూడా వెయ్యని జగన్‌ సర్కార్‌ పాలనపై దేవరపల్లి మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేవరపల్లి నుంచి కురుకూరు రోడ్డు, గోపాలపురం నుంచి దొండపూడి రోడ్డు మంజూరయ్యాయని అధికార పార్టీ ప్రతినిధులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆ నిధులు ఏమయ్యాయని ముప్పిడి ప్రశ్నించారు. అధ్వానం రోడ్లను వెంటనే నిర్మించకపోతే టీడీపీ ఆధ్వ ర్యంలో తీవ్ర ఉద్యమం చేపడతామన్నారు. ముమ్మిడి సత్యనారాయణ, అని శెట్టి ప్రభాకరరావు, ఆలపాటి నాని, కే.రవికుమార్‌, నూతంగి దొరబాబు, పాలూరి శ్రీను, జాలపర్తి భార్గవ్‌, తదితరులు పాల్గొన్నారు.


కొయ్యలగూడెం: గోతులు పూడ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని టీడీ పీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. కొయ్యలగూడెంలో రోడ్ల వెంబడి పాదయాత్ర నిర్వహించారు. షిరిడిసాయిబాబా గుడి నుంచి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. దారిపొడవున గోతుల వద్ద గోతుల్లోనే కూర్చుని నిరసన తెలిపారు. ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా జంగారెడ్డిగూడెం సీఐ గౌరీశంకర్‌ ఆధ్వర్యంలో కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, గోపాలపురం ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. టీడీపీ నేతలు పాలి ప్ర సాద్‌, కొక్కిరిగడ్డ జయరాజు, పారేపల్లి రామారావు, చింతల వెంకటరమణ, అయినపర్తి చందన, శేషు, పెనుమర్తి రామ్‌కుమార్‌, జ్యేష్ట రామకృష్ణ, పారే పల్లి నరేష్‌, పారేపల్లి శ్రీను, ఎం.సోంబాబు, తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.


కామవరపుకోట: అంకాలంపాడు, జలపావారిగూడెం గ్రామాల రహ దారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలియచేశారు. వర్షపు నీటితో ఉన్న గొయ్యి వద్ద వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రామన్నపాలెం సమీపంలో రోడ్డుపై గోతిలో చేపలు పట్టి రోడ్లునిర్మించండి మహాప్రభో అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఏలూరి హరిబాబు, వడ్లపట్ల నరసింహారావు, కనమతరెడ్డి నరేంద్ర రెడ్డి, మద్దిపోటి నాగేశ్వరరావు, తాడిచర్ల సర్పంచ్‌ ముసునూరి పార్థసారథిబాబు, ఎ.రాంబా బు, ఎం.లింగేశ్వరరావు, సూరం సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.


చింతలపూడి: ఏలూరు – చింతలపూడి మార్గంలో ధర్మాజీగూడెం వద్ద గోతులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పూడ్చారు. రహదారులు బాగు చేయాలని నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. తాము తెచ్చిన మెటీరియల్‌ గోతులలో పూడ్చి వెళ్తామన్నారు.

Updated Date - 2021-07-25T05:04:06+05:30 IST