కలపర్రు టోల్‌గేటు వద్ద గోరంట్లను అడ్డుకున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-10-21T18:12:03+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలపర్రు టోల్‌గేటు వద్ద రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చుయ్యచౌదరిని పోలీసులు అడ్డగించారు.

కలపర్రు టోల్‌గేటు వద్ద గోరంట్లను అడ్డుకున్న పోలీసులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలపర్రు టోల్‌గేటు వద్ద రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చుయ్యచౌదరిని  పోలీసులు  అడ్డగించారు. రాజమండ్రి నుంచి చంద్రబాబు దీక్షకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బుచ్చుయ్యచౌదరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏ నిబంధన ప్రకారం ఆపుతున్నారో చెప్పాలని గోరంట్ల  నిలదీశారు. ప్రాధమిక హక్కులకు భంగం కలిగిస్తే సుప్రీం కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటానని హెచ్చరించారు. కొద్దిసేపటి తరువాత బుచ్చుయ్యచౌదరి వాహనాన్ని పోలీసులు వదిలేశారు. 

Updated Date - 2021-10-21T18:12:03+05:30 IST