తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-11-01T05:10:39+05:30 IST

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
దేవరపల్లిలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి

దేవరపల్లి, అక్టోబరు 31: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. దేవరపల్లిలో నియోజకవర్గ సోషల్‌మీడియా, ఐటీడీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలుగు యువత, పార్లమెంట్‌ కమిటీ సభ్యులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వ హించారు. వైసీపీ ప్రభుత్వ దురాగతాలను ఎండగట్టడానికి సోషల్‌మీడియా నాయకులు ముందుండాలన్నారు. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా అక్రమ కేసులు పెట్టినా కార్యకర్తలు సహనంగా ఉండాలని, తాము అండగా ఉంటా మన్నారు. ఏలేటి సత్యనారాయణ, పెనుమత్స సుబ్బరాజు, గుదే వెంకట సుబ్బారావు, సోషల్‌ మీడియా నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T05:10:39+05:30 IST