చింతపర్రులో 100 మంది టీడీపీలో చేరిక

ABN , First Publish Date - 2021-11-01T05:00:49+05:30 IST

అధికార పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనం తెలుగుదేశంలో చేరికలు అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.

చింతపర్రులో 100 మంది టీడీపీలో చేరిక
చింతపర్రులో ఎమ్మెల్యే నిమ్మల సమక్షంలో టీడీపీ చేరిన నాయకులు

పాలకొల్లు, అక్టోబరు 31 : అధికార పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనం తెలుగుదేశంలో చేరికలు అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.చింతపర్రులో ఆదివారం సాయంత్రం వివిధ పార్టీలకు చెందిన 100 తెలుగుదేశం పార్టీలో చేరారు. గ్రామంలో మాజీ ఎంపీపీ పెన్మెత్స  శ్రీదేవి, సత్యనారాయణ రాజు కుమారుడు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో యువకులు, పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు పసుపు కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో  మండల ప్లోర్‌ లీడర్‌ శాగా సత్యనారాయణ, అందే కోటి వీరభద్రరావు, వాసా మల్లికార్జునరావు, అంగర గోపాలకృష్ణ, తాళం శ్రావణకుమార్‌, గూడవల్లి రాజు, బొర్రొ నరేష్‌, అదే సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-01T05:00:49+05:30 IST