ప్రజా పోరాటాలను కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-01-01T04:42:52+05:30 IST

వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల కోసం పోరాటాలు కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ పిలుపునిచ్చారు.

ప్రజా పోరాటాలను కొనసాగించాలి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి

కామవరపుకోట, డిసెంబరు 31: వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల కోసం పోరాటాలు కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ పిలుపునిచ్చారు. కామవరపుకోటలోని పాతూరులో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం, లింగపాలెం మండలాల అధ్యక్షులు సాయ ల సత్యనారాయణ, గరిమెళ్ళ చలపతిరావు, ఘంటా సుధీర్‌బాబు, గుంటుపల్లి సర్పంచ్‌ గోరింక దాసు, తాడిచర్ల సర్పంచ్‌ పసుమర్తి పార్ధసారధిబాబు, వజీర్‌ఖాన్‌, తొంటా రాంబాబు, మేరుగు సుందరరావు, గ్రామ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-01T04:42:52+05:30 IST