ఆగదు మా పోరాటం

ABN , First Publish Date - 2021-10-22T05:02:53+05:30 IST

ఇక తేల్చుకుంటాం..ఆగదు మా పోరాటం..అంటూ టీడీపీ నాయకులు కది లారు..

ఆగదు మా పోరాటం
భీమవరంలో నిరసన దీక్ష చేస్తున్న కోళ్ల నాగేశ్వరరావు తదితరులు

రెండో రోజూ గృహ నిర్బంధాలు.. అరెస్టులు

అయినా మడమతిప్పని టీడీపీ నాయకులు

చంద్రబాబుకు మద్దతుగా కదిలిన నేతలు

ప్రభుత్వ తీరుపై నిరసన


ఇక తేల్చుకుంటాం..ఆగదు మా పోరాటం..అంటూ టీడీపీ నాయకులు కది లారు.. చంద్రబాబు దీక్షకు మద్దతు పలికారు. నియోజకవర్గాల నుంచి పలువురు నాయకులు వెళ్లి చంద్రబాబును కలిశారు. రెండో రోజూ పలువురు నాయ కులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయినా ఆగలేదు.. తమ తమ ఇళ్లలో బాబు దీక్షకు మద్దతుగా దీక్ష చేపట్టారు. టీడీపీ నాయకులంతా ఒక్కటేనని చాటారు.  


భీమవరం అర్బన్‌, అక్టోబరు 21 : అరాచక పాలన ఎంతో కాలం సాగదని.. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారఽథి అన్నారు.మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు చేస్తున్న 36 గం టల నిరసన దీక్షకు మద్దతుగా భీమవరం నుంచి రాష్ట్ర కోశాఽధికారి మెంటే పార్థసారఽథి, టీడీపీ సీనియర్‌ నాయకులు మద్దుల రాము, వీరవాసరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్‌, వీరవల్లి శ్రీనివాస్‌, రాయపల్లి వెంకట్‌, రేవు వెంకన్న, కౌరు పృథ్వీశంకర్‌, బొడ్డు మోహన్‌, కెల్లా చిన్నంనాయుడు తదితరులు హాజరయ్యారు.టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు భీమవరంలోని  స్వగృహంలో నిరసన తెలిపారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెల్లబోయిన సుబ్బారావు, బళ్ళ సురేష్‌ సూరిబాబు, పంతం సతీష్‌, ఎస్‌కే రబ్బానీ, మల్లుల శ్రీధర్‌, బాబూరావు, లంకి లక్ష్మి, నల్లం గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. 


కాళ్ళ : వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. చంద్రబాబు దీక్షకు వెళ్ళనివ్వకుండా ఉండి ఎమ్మె ల్యే మంతెన రామరాజును గురువారం భీమవరం రూరల్‌ పోలీసులు గృహ నిర్భంధం చేశారు. అయితే ఆయన పోలీసులు కళ్లుగప్పి వేరే టీడీపీ నాయకుడి కారులో అమరావతి వెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఆయన వెంట శ్రీనివాసరాజు, అడ్డాల శివరామరాజు, పొత్తూరి వెంకటేశ్వరరాజు,కృష్ణ ఉన్నారు. 


పాలకోడేరు : బెదిరించినా భయపడమని టీడీపీ మండల అధ్యక్షుడు దెందుకూరి ఠాగూర్‌ కోటేశ్వరరాజు అన్నారు. మండలంలో కోటేశ్వరరాజు, సంకురుడు, దొంగ కృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. 


నరసాపురం/ టౌన్‌ :  రాష్ట్రంలో ప్రజాస్వాయం ఖూనీ అయిందని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు పసు పులేటి రత్నమాల విమర్శించారు.పట్టణంలోని కొవ్వలి నాయుడు నివాసంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్‌ రాష్ట్రంలో అరాచక పాలన చేస్తున్నారన్నారు. చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపేందుకు తెలుగు తమ్ముళ్ళు భారీగా తరలివెళ్లారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు,  మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో వేర్వేరుగా సుమారు 20 వాహనాల్లో అమరావతి వెళ్లారు. చిటికెల రామ్మోహన్‌, జక్కంశెట్టి వెంకటేశ్వరరావు, రేవు ప్రభుదాసు, తంగెళ్ల నాగేశ్వరరావు, చాగంటి ఆ నంద్‌, కొట్టు పండు, పులపర్తి దత్తు, అండ్రాజు రామన్న, గన్నవరపు శ్రీనువాస్‌, పులపర్తి శ్రీధర్‌, జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, జోగి పండు, గుబ్బల నాగరాజు, వాతాడి ఉమా,సత్యనారాయణ, పాలా రాంబాబు, శశిదేవి, చల్లా పద్మావతి,బి.చిన్నాయమ్మ, శ్రీపద్మ, తాయారు,సంకు భాస్కర్‌,సురేష్‌ పాల్గొన్నారు.


పాలకొల్లు అర్బన్‌ : చంద్రబాబు దీక్షకు వెళ్ళకుండా పలువురు టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టులు చేశారు. కర్నేన గౌరునాయుడు, కర్నేన రోజా రమణి, గండేటి వెంకటేశ్వరరావు (జీవీ)లను పట్టణ పోలీసులు  హౌస్‌ అరె స్టులు చేశారు. పెచ్చెట్టి వెంకట నరసింహారావు, ధనాని సూర్య ప్రకాష్‌, వట్టం గణేష్‌, ఎం.ఫకీర్‌ బాబు, జగ్గురోతు రాంబాబు తదితరులను ఇళ్ల వద్ద అరెస్టు చేసి పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. గురువారం ఉద యం 11 గంటలు దాటిన తరువాత విడుదల చేశారు. హౌస్‌ అరెస్టులు ముందుగానే పసిగట్టిన ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ మోహన్‌ బుధవారం రాత్రే తరలి వెళ్లి మద్దతుగా నిలిచారు. 


ఉండి : చంద్రబాబు దీక్షకు ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు గురువారం రాత్రి చంద్రబాబు వద్దకు వెళ్లి సంఘీభావం తెలి పారు. వైసీపీ ప్రభుత్వం దాడులకు పాల్పడడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు దీక్షతో అయినా ప్రభుత్వం బుద్ధి మార్చుకోవాలన్నారు. ఎంతో మంది నాయకులు చూపిన బాటను నాశనం చేయవద్దని హితవు పలికారు. Updated Date - 2021-10-22T05:02:53+05:30 IST